బల్కంపేటలో ఫుట్‌పాత్‌పై వరుసగా నిలిపిన సెకండ్ సేల్స్ కార్లు
అమీర్‌పేట: సెకండ్‌హ్యాండ్ సేల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్ సంస్థల వాహనాలనూ రోడ్లపైనే నిలుపుతుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. కార్ల సెకండ్ సేల్స్‌కు బల్కంపేట, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. చాలామంది ఇక్కడి పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలున్న చోట వ్యాపారాలు చేయాల్సి ఉండగా.. చాలామంది నివాస గృహాలను అద్దెకు తీసుకొని బిజినెస్ నడిపిస్తున్నారు. విక్రయానికి వచ్చే కార్లను రోజుల తరబడి ఫుట్‌పాత్‌లపై నిలిపి ఉంచుతున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకా, 60 ఫీట్ రోడ్డు, బీకేగూడ, ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బీకేగూడ మున్సిపల్ వార్డు కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనిపై బల్దియా అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment