
సాక్షి, ముషీరాబాద్ : గతంలో ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే అధికారులు ఆ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్‌గా ప్రకటిస్తూ బారికేడ్‌లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించేవారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను జీహెచ్‌ఎంసీ సిబ్బందే అందజేసేవారు. తాజాగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం ఏ ఇంట్లోనైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారందరినీ ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి, నిత్యావసర వస్తువుల కోసం సమీపంలోని కిరాణా షాపు, పాలబూత్‌ల ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. తాజాగా కవాడిగూడలోని భాగ్యలక్షి్మకాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
(కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ)
Comments
Please login to add a commentAdd a comment