ఈదురుగాలులతో హైదరాబాద్‌లో జోరు వాన | Hyderabad Rains: Horrific Thunder Lightning Winds Heavy Rains | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో బీభత్సం

Published Wed, Oct 5 2022 6:26 PM | Last Updated on Wed, Oct 5 2022 6:32 PM

Hyderabad Rains: Horrific Thunder Lightning Winds Heavy Rains - Sakshi

నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో..

సాక్షి, హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావం మరోసారి నగరంపై పడింది. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి‌.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించడం.. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement