సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం దంచికొడుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో మొదలైన వాన ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండలోనూ వాన కుమ్మేస్తోంది.
వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా గతకొన్నిరోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నేడు మరోసారి భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Heavy rain at Punjagutta.@HiHyderabad @swachhhyd @balaji25_t @Rajani_Weather @RajenderPHP @PANDARAJATH @sai_koushika @aSouthIndian @puducherri @NallulaHere @GHMCOnline #HyderabadRains pic.twitter.com/ZyPjeWwWZF
— Amar⚡ (@amartadi) July 31, 2022
Huge rain at budvel Rajendranagar since 30 mints @Hyderabadrains @balaji25_t pic.twitter.com/Js441CZsBA
— L Tarun Kumar (@LTarunKumar1) July 31, 2022
Comments
Please login to add a commentAdd a comment