
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో భారీగా వర్షం పడుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడి.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షం ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లమీద వరదనీరు చేరింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment