
నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
సాక్షి, హైదరాబాద్: నగరంలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, ముసాపేట్, నాంపల్లి, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్‌లో వర్షం పడింది.
వర్షానికి రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కార్యాలయాల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.