
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మెహదీపట్నం, మణికొండ, షేక్ పేట్, మాసబ్ ట్యాంక్, టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం కురుస్తోంది.
కొన్నిచోట్ల ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 16 వరకు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏడు గంటల పాటు ఆ రూట్లు బంద్
Comments
Please login to add a commentAdd a comment