
నగరంలోని శుక్రవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
సాక్షి, హైదరాబాద్: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, నగరంలోని శుక్రవారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
బండ్లగూడ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, కర్మన్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.