
సాక్షి, హైదరాబాద్: కోస్తాకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. కోసాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో నేడు, రేపు(బుధ,గురు) భారీ వర్షాలు కురిసే అవకాముందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
నేడు(బుధవారం) నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రేపు(గురువారం) నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్!