సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడగా మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది.
మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, సురారం, గాజులరామారం, కూకట్‌పల్లి, చింతల్, బాలానగర్, నార్సింగి, కోకాపేట్, కొండాపూర్, కొంపల్లి, అల్వాల్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, లింగంపల్లి, నిజాంపేట, నేరెడ్‌మెట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది.
View in Gachibowli pic.twitter.com/3Ume7WqYOL
— Suman Amarnath (@sumanva) June 4, 2023
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, రామచంద్రపురం, అమీన్‌పూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలో వాన దంచికొడుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
Heavy winds and rains in Gachibowli side of Hyderabad. pic.twitter.com/GhC2msC98D
— N Jagannath Das_TT (@dassport_TT) June 4, 2023
మరోవైపు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడే అవకాశాలున్నాయని, మిగతా చోట్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపింది.
Storm! #Hyderabad #Hyderabadrains pic.twitter.com/AUbuVyhlmv
— krishna karthik (@krishnakarthik1) June 4, 2023
@balaji25_t @HYDWeatherMan HeavyRains at alwal #Hyderabad #Rains pic.twitter.com/G2SacYLIbM
— Mahesh MK (@ursmaheshmk) June 4, 2023
Comments
Please login to add a commentAdd a comment