Threats To Rape And Take Photos Of Young Woman in Ballari - Sakshi
Sakshi News home page

కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు.. అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు..

Published Fri, Apr 29 2022 7:23 AM | Last Updated on Fri, Apr 29 2022 1:44 PM

Threats To Rape And Take Photos Of Young Woman - Sakshi

సాక్షి, బళ్లారి: యాదగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హొసళ్లి గ్రామానికి చెందిన ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. యాదగిరి ఎస్‌పీ వేదమూర్తి గురువారం మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఓ యువతి పని చేసేందుకు హొసళ్లి తండా నుంచి యాదగిరికి ఆటోలో వెళ్లి వచ్చేది. ఈ నెల 26న ఆటో డ్రైవర్‌ హనుమంతు పథకం ప్రకారం స్నేహితుడు నరసప్పతో కలిసి ఆటోలో కూర్చొన్న యువతిని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. తనను వదిలివేయాలని ఆమె కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు. పైగా అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో తీసి ఆమెను బెదిరించారు.

తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. యువతి కుటుంబ సభ్యులకు దారుణం గురించి చెప్పింది. వారు యాదగిరి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు గాలించి హనుమంతు, నరసప్పలను అరెస్ట్‌ చేశారు. ఎస్‌పీ మాట్లాడుతూ ఆటోల్లో వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలని,  కుటుంబ సభ్యులకు ఆటో నంబర్‌తో పాటు, లొకేషన్‌ను పంపాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌కు ‘ఐ లవ్‌ యూ’ మెసేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement