women harassed
-
కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు.. అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు..
సాక్షి, బళ్లారి: యాదగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హొసళ్లి గ్రామానికి చెందిన ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. యాదగిరి ఎస్పీ వేదమూర్తి గురువారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఓ యువతి పని చేసేందుకు హొసళ్లి తండా నుంచి యాదగిరికి ఆటోలో వెళ్లి వచ్చేది. ఈ నెల 26న ఆటో డ్రైవర్ హనుమంతు పథకం ప్రకారం స్నేహితుడు నరసప్పతో కలిసి ఆటోలో కూర్చొన్న యువతిని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. తనను వదిలివేయాలని ఆమె కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు. పైగా అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియో తీసి ఆమెను బెదిరించారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. యువతి కుటుంబ సభ్యులకు దారుణం గురించి చెప్పింది. వారు యాదగిరి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు గాలించి హనుమంతు, నరసప్పలను అరెస్ట్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఆటోల్లో వెళ్లేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలని, కుటుంబ సభ్యులకు ఆటో నంబర్‌తో పాటు, లొకేషన్‌ను పంపాలని సూచించారు. ఇది కూడా చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్‌కు ‘ఐ లవ్ యూ’ మెసేజ్ -
యువతిపై అత్యాచారం..
సాక్షి, గుర్ల(విజయనగరం) : మూగజీవాలను మేతకు తోలుకెళ్లిన యువతిపై ఇద్దరు కామాంధులు కాటువేశారు. నిర్మానుష్య ప్రదేశాన్ని అనువుగా చేసుకుని అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్రహింసలకు గురిచేశారు. తమవద్ద ఉన్న సెల్ఫోన్లతో యువతి నగ్నచిత్రాలను చిత్రీకరించారు. వాటితోనే వారం రోజులుగా బెదిరిస్తున్నారు. నిలదీసిన కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. పెద్దలు కుదిర్చిన రాజీకి వెరవకుండా వెకిలిచేష్టలకు దిగారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మానవ మృగాలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గుర్ల మండలం దేవునికణపాకలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని దేవుని కణపాకకు చెందిన 21 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాధిత యువతి, మరో ఇద్దరు యువకులు ఈ నెల 18న గ్రామ సమీపంలోని గడిగెడ్డ రిజర్వాయర్ సమీపంలో ఆవులు, మేకలు మేపుతున్నారు. ఇంతలో ఒక్కసారిగా ఇద్దరు యువకులు కొర్నాన ఆనంద్, కొర్నాన నాగరాజు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే సెల్ఫోన్లో బాధిత యువతి నగ్న చిత్రాలు తీశారు. ఈ విషయాన్ని బాధిత యువతి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో గ్రామపెద్దలు కొంత నగదు ముట్టజెప్పాలని యువకులను ఆదేశించారు. అయితే నిర్ణీత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ డి. రమేష్, ఎస్సైతో కలిసి గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాధితురాలికి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని.. నివేదిక వచ్చిన తర్వాత కోర్టుకు అందిస్తామన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
మహిళలను వేధించినందుకు.. ఉద్యోగం పోయింది
భారత వైమానిక దళానికి చెందిన ఈస్ట్రన్ కమాండ్‌లోని సీనియర్ గ్రూప్ కెప్టెన్.. ఇద్దరు మహిళలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. వైమానిక దళానికే చెందిన మరో అధికారి భార్యతో పాటు.. మరో మహిళ కూడా ఇతగాడు తమను వేధిస్తున్నట్లు వైమానిక దళ ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించారు. అందులో అతడి వేధింపుల విషయం వాస్తవమేనని తేలడంతో.. అతడి ఉద్యోగం ఊడబీకారు. ఇటీవలే ఆ సీనియర్ గ్రూప్ కెప్టెన్‌కు పదోన్నతి లభించింది. తర్వాత కొద్దిరోజులకే ఉద్యోగం ఊడిపోయింది.