
మహిళలను వేధించినందుకు.. ఉద్యోగం పోయింది
భారత వైమానిక దళానికి చెందిన ఈస్ట్రన్ కమాండ్‌లోని సీనియర్ గ్రూప్ కెప్టెన్.. ఇద్దరు మహిళలను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. వైమానిక దళానికే చెందిన మరో అధికారి భార్యతో పాటు.. మరో మహిళ కూడా ఇతగాడు తమను వేధిస్తున్నట్లు వైమానిక దళ ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపించారు.
అందులో అతడి వేధింపుల విషయం వాస్తవమేనని తేలడంతో.. అతడి ఉద్యోగం ఊడబీకారు. ఇటీవలే ఆ సీనియర్ గ్రూప్ కెప్టెన్‌కు పదోన్నతి లభించింది. తర్వాత కొద్దిరోజులకే ఉద్యోగం ఊడిపోయింది.