తృణమూల్ నాయకులపై వారే ఫిర్యాదు చేశారు
మేము లైంగిక వేధింపులకు గురికాలేదు
తెరపైకి వచి్చన సందేశ్‌ఖాలీ మహిళల వీడియోలు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్‌ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు.
స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్‌లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు.
ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్‌ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదంతా కుట్ర: సువేందు అధికారి
కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు.
బీజేపీ నేతలపై ఫిర్యాదు
సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్‌ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment