భార్య అర్ధ నగ్న చిత్రాలను స్నేహితులకు పంపిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్య అర్ధ నగ్న చిత్రాలను స్నేహితులకు పంపిన భర్త

Jul 4 2023 7:30 AM | Updated on Jul 4 2023 7:36 AM

- - Sakshi

భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆమె ప్రైవేట్‌ వీడియోలు, అర్ధనగ్న చిత్రాలను స్నేహితులకు పంపడంతో పాటు ఇంటర్నెట్లో పెట్టాడు.

కర్ణాటక: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త, భార్యపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఆమె ప్రైవేట్‌ వీడియోలు, అర్ధనగ్న చిత్రాలను స్నేహితులకు పంపడంతో పాటు ఇంటర్నెట్లో పెట్టాడు. ఇది తెలిసి బాధితురాలు మైసూరు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉదయగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతి నగరలో నివాసం ఉంటున్న అబ్దుల్‌ సలీంతో 10 నెలల కిందట ఒక యువతికి పెళ్లయింది.

అయితే కొద్దిరోజులకే గొడవలు పడి దూరం అయ్యారు. ఇద్దరు కలిసి ఉన్న సమయంలో అబ్దుల్‌ సలీం భార్య వీడియోలు, అర్ధనగ్న ఫోటోలను తీసి పెట్టుకున్నాడు. తనను కాదని వెళ్లిపోయిందన్న ఉక్రోషంతో వాటిని స్నేహితులకు పంపడంతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement