ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కిటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన మహిళా రైల్వే ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన నవీన్ కిటికి నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్‌పై శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
లైంగిక వేధింపులు
లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన వరలక్ష్మి ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌ఉమెన్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అరవింద్ ఈనెల 16న రాత్రి వెకిలిచేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరవింద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు.
అసభ్య పదజాలంతో మెసేజ్‌లు..
అసభ్యపదజాలంతో వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సౌజన్య రాణిగంజ్ హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో టెలికాలర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా ఓ వ్యక్తి అసభ్యపదజాలంతో మెసేజ్‌లు వీడియోలు పంపిస్తున్నాడు. వాట్సాప్ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి పంపిస్తున్నాడు. తగిన ఆధారాలతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు.
చదవండి: ‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’
Comments
Please login to add a commentAdd a comment