chilakalaguda police station
-
కీటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు తీసి..
సాక్షి, హైదరాబాద్: కిటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు, వీడియోలు తీస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుగూడకు చెందిన మహిళా రైల్వే ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన నవీన్ కిటికి నుంచి ఫొటోలు, వీడియోలు తీస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్‌పై శనివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. లైంగిక వేధింపులు లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్మండి మేడిబావికి చెందిన వరలక్ష్మి ఓ అపార్ట్మెంట్లో వాచ్‌ఉమెన్‌గా పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన అరవింద్ ఈనెల 16న రాత్రి వెకిలిచేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరవింద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. అసభ్య పదజాలంతో మెసేజ్‌లు.. అసభ్యపదజాలంతో వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండు ఉప్పరిబస్తీకి చెందిన సౌజన్య రాణిగంజ్ హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో టెలికాలర్‌గా పనిచేస్తోంది. కొంతకాలంగా ఓ వ్యక్తి అసభ్యపదజాలంతో మెసేజ్‌లు వీడియోలు పంపిస్తున్నాడు. వాట్సాప్ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి పంపిస్తున్నాడు. తగిన ఆధారాలతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: ‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’ -
అనుమానాస్పద స్ధితిలో విద్యార్ధిని మృతి
-
వారాసిగూడలో దారుణం, ఉద్రికత్త
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఇర్ఫానా అనే బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. కాగా బాలికపై దుండగులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రెండు అపార్ట్మెంట్ల మధ్య పడిఉన్న బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి,పోస్ట్‌మార్టం చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా బాలిక నిన్న సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్తంగా వారాసిగూడ ప్రాంతం కాగా ఈ సంఘటనతో వారాసిగూడ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలి ఇంటి వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరోవైపు మృతురాలి బంధువులు..బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వారాసిగూడలో భారీగా మోహరించారు. -
సికింద్రాబాద్‌లో రౌడీ షీటర్ హల్చల్
-
పోలీస్‌స్టేషన్‌లో సైకో హల్ చల్
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఓ సైకో హల్చల్ చేశాడు. పోలీసు వాహనం అద్దాలు పగలకొట్టాడు. సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురానికి చెందిన మనోహర్ అనే యువకుడిని పోలీసులు ఓ కేసు విచారణలో భాగంగా స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే సరిగా మతిస్థిమితం లేని మనోహర్ స్టేషన్లో హల్చల్ చేసి ఆవరణలో ఉన్న పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టాడు. దీంతో సదరు సైకోను పోలీసులు ఎర్రగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. -
పీఎస్ బ్యారక్‌లోనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ బ్యారక్‌లోనే ఆత్యహత్యకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన శివ అనే వ్యక్తిని దొంగతనం కేసులో 12 రోజులగా చిలకలగూడా పోలీసులు స్టేషన్ లో నిర్భందించారు. ఇదే కేసుకు సంబంధించి... తండ్రిని కూడ పోలీస్టేషన్ తీసుకురావటంతో .. మనస్తాపం చెందిన శివ బ్యారక్‌లోనే బాత్రూములను శుభ్రం చేసే.. యాసిడ్ తాగి అత్యహత్యాయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన పోలీసులు మొదట గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పోక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన బస్తీవాసులు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. శివ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ స్టేషన్ ముందు బైఠాయించారు.