పీఎస్ బ్యారక్‌లోనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Robbery accused attempts suicide in chilakaguda police station | Sakshi
Sakshi News home page

పీఎస్ బ్యారక్‌లోనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Mon, Sep 16 2013 1:42 PM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM

పీఎస్ బ్యారక్‌లోనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పీఎస్ బ్యారక్‌లోనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ : పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ బ్యారక్‌లోనే ఆత్యహత్యకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన శివ అనే వ్యక్తిని దొంగతనం కేసులో 12 రోజులగా చిలకలగూడా పోలీసులు స్టేషన్ లో నిర్భందించారు.

ఇదే కేసుకు సంబంధించి... తండ్రిని కూడ పోలీస్టేషన్ తీసుకురావటంతో .. మనస్తాపం చెందిన శివ బ్యారక్‌లోనే బాత్రూములను శుభ్రం చేసే.. యాసిడ్ తాగి అత్యహత్యాయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన పోలీసులు మొదట గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బయటకు పోక్కడంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన బస్తీవాసులు పోలీస్‌ స్టేషన్ ముట్టడించారు. శివ ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ స్టేషన్‌ ముందు బైఠాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement