
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మహా కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళలు, బట్టలు మార్చుకుంటున్న మహిళలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఉదంతం వెలుగుచూసింది దీనిని గమనించిన యూపీ పోలీసులు రంగంలోకి దిగి, నిందితులపై చర్యలకు ఉపక్రమించారు.
ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు.. సోషల్ మీడియాలో మహా కుంభమేళాకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు, వదంతులను వ్యాప్తి చేసే వారిపై నిరంతరం పోలీసులు దృష్టిసారిస్తున్నారు. అలాంటివారిని గుర్తించి, చర్యలు చేపడుతున్నారు. మహాకుంభ్‌లో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు కొందరు వీడియోలు తీసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారని పోలీసులకు తెలియవచ్చింది. ఇది మహిళల గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమేనంటూ పోలీసులు ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.
యూపీ పోలీసుల ఈ తరహాలోని రెండు ఉదంతాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న @neha1224872024 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుంభమేళాకు వచ్చిన మహిళలు స్నానం చేస్తూ, బట్టలు మార్చుకుంటున్న వీడియోలను ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను నిర్వహిస్తున్న వారిని గుర్తించేందుకు యూపీ పోలీసులు మెటా కంపెనీ నుండి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఇదేవిధంగా ఫిబ్రవరి 19న టెలిగ్రామ్ ఛానెల్‌లోని ఒక ఖాతాపై కేసు నమోదయ్యింది. మహా కుంభోత్సవంలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను అందుబాటులో ఉంచుతామని టెలిగ్రామ్ ఛానల్ CCTV CHANNEL 11 పేర్కొంది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.
ఇది కూడా చదవండి: Delhi: సీఎంగా రేఖా గుప్తా ఎంపికతో హర్యానాలో సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment