ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి.
జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్‌లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.
మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్‌రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది.
ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్?
Comments
Please login to add a commentAdd a comment