Anand Mahindra Praises African Tiktokers- Sakshi
Sakshi News home page

వాళ్లని చూస్తే నాకు ఆత్మానందం కలుగుతుంది - ఆనంద్‌ మహీంద్రా

Published Fri, Dec 24 2021 2:16 PM | Last Updated on Fri, Dec 24 2021 3:08 PM

Anand Mahindra Praises African Tiktokers - Sakshi

ఇంటర్నెట్‌తో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. సోషల్‌ మీడియా వచ్చాక సాంస్కృతిక సామరస్యం పెరిగిపోయింది. భారతీయ కళలు, సినిమాలకి అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడుతున్నారు. అలా బాలీవుడ్‌ పాటలకు టిక్‌టాక్‌ వీడియోస్‌ చేసే ఓ ఆఫ్రికన్‌ జంట మన ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రాను ఆకట్టుకున్నారు. 

బాలీవుడ్‌ పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేసే ఈ ఆఫ్రికన్‌ జంటకి ఇప్పటికే ఎంతో మంది భారతీయులు ఫిదా అయ్యారు. వీళ్లు ఎప్పుడు వీడియోస్‌ చేస్తుంటారా అని ఎదురు చూస్తుంటారు కూడా. కాగా వీళ్లు చేసిన వీడియోస్‌లో బాగా పాపులర్‌ అయిన వాటిలో షేర్‌షా మూవీలో సాంగ్‌ ఒకటి.

షేర్‌షా మూవీలో ఓ సావ్‌రే సాంగ్‌ టిక్‌టాక్‌ వీడియోను ఆనంద్‌ మహీంద్రా చూశారు. అంతే ఒక్కసారిగా వాళ్ల పెర్ఫార్మెన్స్‌కి ఫ్యాన్‌ అయ్యారు. తనకు డ్యాన్స్‌ చేయాలనిపిస్తుందన్నారు. వాళ్ల ప్రతిభను చూసి తనకు ఆత్మానందం కలిగిందన్నారు ఆనంద్‌ మహీంద్రా.

చదవండి:పేద కమ్మరికి బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement