
వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు
తిరుపతి: సోషల్ మీడియాలో అసభ్యకరమైన చిన్నపిల్లల అశ్లీల వీడియోలను పోస్టు చేసిన కేసులో ముగ్గురిని సైబర్ పోలీసు లు అరెస్టు చేసినట్టు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేసిన వారిపై ‘నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోరైటెడ్ చిల్డ్రన్’ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిరుపతి మహిళా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
చదవండి: మనువాడమన్నందుకు.. మట్టుబెట్టాడు
దర్యాప్తులో వివిధ వెబ్‌సైట్‌లలో చిన్నపిల్లలకు సంబంధించిన 31 అసభ్యకర అశ్లీల వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని, పేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేయడమే కాకుండా ఇతరులకు నిందితులు షేర్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో తిరుచానూరుకు చెందిన కిషోర్ బాబు(28), మునికమల్(22), బైరాగిపట్టెడకు చెందిన సాయి శ్రీనివాసులును అరెస్టు చేశారు. ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే పోలీసు వాట్సాప్ 8099999977 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన మహిళా పోలీసు స్టేషన్ సిబ్బంది, సైబర్ పోలీసులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment