NCMEC
-
చైల్డ్ పోర్న్‌ను చుసినా , షేర్ చేసినా పట్టిస్తుంది!
హైదరాబాద్‌కు చెందిన ఓ విపరీత మనస్తత్వంగల యువకుడు చైల్డ్ పోర్న్ వీడియోను దర్జాగా తన సోషల్ మీడియాఖాతాలో పోస్ట్ చేశాడు. ఇదేమీ పెద్ద నేరం కాదని.. తన చర్యను ఎవరూ పసిగట్టరని అనుకున్నాడు. కానీ అతను వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికాకు చెందిన ఓ సంస్థ నిందితుడి చర్యను కనిపెట్టింది. చిటికెలో అతని ఐపీ అడ్రస్ ద్వారా జాడ కనుక్కొని ఆ వివరాలన్నింటినీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు పంపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన చైల్డ్ పోర్నోగ్రఫీపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఈ తరహా వీడియోల కట్టడి, నిందితుల గుర్తింపు కోసం అగ్రరాజ్యం వేదికగా నిరంతర నిఘా కొనసాగుతోంది. అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలను జల్లెడపడుతూ పోర్న్ వీడియోలు చూసిన లేదా షేర్ చేసిన లేదా అప్లోడ్/డౌన్లోడ్ చేసిన వారిపై నిఘా పెడుతోంది. చైల్డ్ సెక్యువల్ అబ్యూజ్డ్ మెటీరియల్‌ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్వేర్ వినియోగిస్తోంది.భారత్‌లో ప్రతి 40 సెకన్లకు ఓ వీడియో...ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత వేగంగా పెరుగుతోందని, భారత్‌లో ప్రతి 40 సెకన్లకు ఓ వీడియో క్యాప్చర్ అవుతోందని ఎన్‌సీఎంఈసీ అంచనా వేస్తోంది. సీఎస్ఏఎంని గుర్తించడానికి అమెరికా సంస్థ ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయం తీసుకుంటోంది. అందులో కొన్ని కీలక పదాలను పొందుపరిచింది. ప్రపంచంలో ఎవరైనా ఆయా సోషల్ మీడియా వేదికలపై సీఎస్ఏఎంను సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్/అప్లోడ్ చేసినా తక్షణం ఆ సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఆయా యూజర్లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను వెంటనే సర్వర్‌లో నిక్షిప్తం చేసుకుంటుంది.ఎన్‌సీఎంఈసీ వాటిని ప్రాధాన్యతా క్రమంలో క్రోడీకరించి ఆయా దేశాల నోడల్ ఏజెన్సీలకు పంపిస్తుంది. భారత్‌లో జాతీయ స్థాయిలో జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ), రాష్ట్ర స్థాయిలో సీఐడీ ఎన్సీఎంఈసీకి నోడల్ ఏజెన్సీలుగా ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన డౌన్లోడ్/అప్లోడ్ లేదా వీక్షించడం జరిగితే సీఐడీ అధికారులు ఆ ఐపీ అడ్రస్ వినియోగదారుడు నివసించే స్థానిక సైబర్ క్రైం ఠాణాకు ఆయా వివరాలు పంపిస్తారు. అనంతరం వారికి నోటీసులు ఇవ్వడమో లేదా కేసుపెట్టి అరెస్టు చేసి చార్జిషీట్ దాఖలు చేయడమో జరుగుతుంది.నేరం రుజువైతే తీవ్ర శిక్షలుచైల్డ్ పోర్న్ వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం మాకు అందుతుంది. దీని ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఈ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి పక్కా ఆధారాలతో చార్జిïÙట్లు దాఖలు చేస్తాం. కోర్టులో నేరం రుజువైతే దోషిగా తొలిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు, రూ. 5 లక్షల వరకు జరిమానా.. రెండోసారి నేరం చేస్తే ఐదేళ్ల వరకు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా పడుతుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే పోక్సో చట్టం కింద కేసులను సైతం నిందితులపై నమోదు చేస్తాం. ఆయా కేసుల్లో కోర్టులు వారిని దోషులుగా నిర్ధారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరమని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. – శివమారుతి, హైదరాబాద్ సైబర్ క్రైం ఠాణా ఏసీపీఆ సర్వర్లన్నీ విదేశాల్లోనే...కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీయే కాదు.. అన్ని రకాల అసభ్య, అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. అయితే వాటి నిర్వాహకులు బ్లాక్‌లిస్ట్‌లోని వెబ్సైట్ల పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు, కొన్ని అక్షరాలు కలిపి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. ఫలితంగా వాటిపై మళ్లీ ఫిర్యాదులు అందే వరకు ఆ సైట్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉండటం వల్ల వరుసగా ఫిర్యాదులు వచ్చినప్పటికీ వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. -
వాటి జోలికెళ్తే.. ఐదేళ్లు జైలుకే..!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారితీస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫొటోలను పోస్టు చేసినా, షేర్ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. ఐదేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్నెట్తోపాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ)’పనిచేస్తోంది. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు, ఫొటోల (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్– సీఎస్ఏఎం)ను, వాటి గురించి సెర్చ్ చేస్తున్నవారు, వీక్షిస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం హైదరాబాద్‌లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్య, అశ్లీల చిత్రాలన్నీ చైల్డ్ పోర్నోగ్రఫీ కిందికి వస్తాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సాహిత్యం తదితరాలను సీఎస్ఏఎంగా పరిగణిస్తారు. ఎన్‌సీఎంఈసీ ఆధ్వర్యంలో.. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1984 జూన్ 13న ఎన్‌సీఎంఈసీ ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ చర్యలు ముమ్మరమయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2021లో భారత్ నుంచే 25 వేలకుపైగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆధునిక టెక్నాలజీతో పటిష్ట నిఘా.. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతూ ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంటెంట్‌ను, సెర్చింగ్‌ను గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ గురించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. వారు వినియోగించిన కంప్యూటర్/ల్యాప్‌టాప్/ఫోన్ల ఐపీ అడ్రస్‌లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ వివరాలను ఎన్‌సీఎంఈసీ క్రోడీకరించి ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తుంది. మనదేశంలో జాతీయస్థాయిలో హోంశాఖ అధీనంలోని ఎన్సీఆర్బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీనికి అందిన వివరాలను రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తుంది. రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు ఈ వివరాలను సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేయడం/ నోటీసులివ్వడం వంటి చర్యలు చేపడతారు. స్మార్ట్ఫోన్లతో పెరిగి.. కోవిడ్‌తో విజృంభించి.. విస్తృతమైన ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసగా మారుతున్నారు. కోవిడ్ లాక్డౌన్, ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదుకాగా.. 2020 నాటికి ఈ సంఖ్య 738కి, 2021లో 969కి పెరగడం గమనార్హం. జరుగుతున్న ఉదంతాల్లో కనీసం ఒక శాతం కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి కేసులుగా మారట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాల్లో సర్వర్ల కారణంగా.. అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. కానీ వాటి నిర్వాహకులు వెబ్సైట్ పేరులో స్వల్ప మార్పులు చేసి మరో వెబ్‌సైట్‌గా అందుబాటులోకి తెస్తున్నారు. వాటిపై ఫిర్యాదులు వచ్చి చర్యలు తీసుకునేవరకు ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. వాటిపై ఫిర్యాదులు వచ్చినా నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. బాగా చదువుకున్నవారూ నిందితుల్లో.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్‌లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. పోలీసులు నిందితులతోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఈ కేసుల్లో ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. అన్నిరకాలా నష్టం పోర్నోగ్రఫీకి బానిస అవుతున్నవారు అన్నిరకాలా నష్టపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్‌తో పాటే వైరస్లు ఉంటాయని.. ఆయా వెబ్సైట్ల ద్వారా వైరస్‌లను పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డులు, ఇతర వివరాలూ హ్యాకర్లకు చేరి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీనికోసం ఎవరు సెర్చ్ చేసినా, వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని 67–బీ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం. ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ వేస్తాం. కోర్టులో నేరం నిరూపితమైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది. –గజరావ్ భూపాల్, సంయుక్త పోలీసు కమిషనర్, సీసీఎస్, హైదరాబాద్ -
అసభ్య వీడియోల కేసులో ముగ్గురి అరెస్టు
తిరుపతి: సోషల్ మీడియాలో అసభ్యకరమైన చిన్నపిల్లల అశ్లీల వీడియోలను పోస్టు చేసిన కేసులో ముగ్గురిని సైబర్ పోలీసు లు అరెస్టు చేసినట్టు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అశ్లీల వీడియోలను అప్లోడ్ చేసిన వారిపై ‘నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోరైటెడ్ చిల్డ్రన్’ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిరుపతి మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. చదవండి: మనువాడమన్నందుకు.. మట్టుబెట్టాడు దర్యాప్తులో వివిధ వెబ్సైట్లలో చిన్నపిల్లలకు సంబంధించిన 31 అసభ్యకర అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసుకుని, పేస్బుక్, ట్విట్టర్, గూగుల్ డ్రైవ్‌లో అప్లోడ్ చేయడమే కాకుండా ఇతరులకు నిందితులు షేర్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో తిరుచానూరుకు చెందిన కిషోర్ బాబు(28), మునికమల్(22), బైరాగిపట్టెడకు చెందిన సాయి శ్రీనివాసులును అరెస్టు చేశారు. ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే పోలీసు వాట్సాప్ 8099999977 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన మహిళా పోలీసు స్టేషన్ సిబ్బంది, సైబర్ పోలీసులను ఎస్పీ అభినందించారు. చదవండి: సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా -
అశ్లీల కట్టడికి అమెరికా సంస్థ సాయం
సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో బాలల అశ్లీల వెబ్సైట్లను అరికట్టడానికి అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ)... పిల్లల అశ్లీలానికి సంబంధించిన వీడియోల అప్లోడింగ్ సమాచారాన్ని 99 దేశాలకు అందిస్తోందని పేర్కొంది. తప్పిపోయిన, లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక చానెల్ ద్వారా ఆ సంస్థ వివిధ దేశాల భద్రతా సంస్థలకు సమకూరుస్తోందని వెల్లడించింది. పిల్లల అశ్లీల వీడియోల కట్టడికి సంబంధించి స్టేటస్ రిపోర్టును కేంద్రం సుప్రీంకోర్టులో సమర్పిస్తూ ఈ విషయాలను పేర్కొంది. సమాచారాన్ని ఉచితంగా పొందేందుకు వీలుగా ఆ సంస్థ భారత్‌లో కూడా ఓ ప్రత్యేక చానెల్‌ను ఏర్పాటుచేస్తుందని వెల్లడించింది.