
యాదాద్రిభువనగిరిజిల్లా,సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్‌రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు,కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్‌రెడ్డి ఏకంగా రీల్స్ చేయడం దుమారానికి కారణమైంది.
భాస్కర్ రావు ఆలయ ఈవోగా వచ్చాక రాజకీయ నాయకులను చూసి చూడమట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏకంగా లడ్డూ కౌంటర్‌లోపలికి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించారన్న ఆరోపణలున్నాయి.
ఈ వ్యవహారంలో తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అంతకు ముందు కొండపైనున్న బాత్ రూముల్లోనే ఏకంగా తాగిపడేసిన మందుబాటిల్స్,గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కాగా, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment