Yadadari temple
-
యాదాద్రిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
-
మరో వివాదంలో కౌశిక్‌రెడ్డి.. యాదాద్రి గుడిలో రీల్స్
యాదాద్రిభువనగిరిజిల్లా,సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్‌రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు,కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్‌రెడ్డి ఏకంగా రీల్స్ చేయడం దుమారానికి కారణమైంది.భాస్కర్ రావు ఆలయ ఈవోగా వచ్చాక రాజకీయ నాయకులను చూసి చూడమట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏకంగా లడ్డూ కౌంటర్‌లోపలికి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించారన్న ఆరోపణలున్నాయి.ఈ వ్యవహారంలో తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అంతకు ముందు కొండపైనున్న బాత్ రూముల్లోనే ఏకంగా తాగిపడేసిన మందుబాటిల్స్,గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కాగా, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్‌రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు -
‘టీటీడీ’ తరహాలో యాదాద్రి బోర్డు: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం(ఆగస్టు30) సచివాలయంలో రివ్యూ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు.ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. -
సీఎం గారూ.. నిధులివ్వండి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఆయన రానున్నారు. సీఎం అయిన తర్వాత తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తుండడంతో వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో భక్తులు ఉన్నారు. రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ఆల య పునర్నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఇంకా రూ.150 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. నిధుల లేమితో పనులు నిలిచిపోయాయి. వైటీడీఏ ద్వారా యాదాద్రి అభివృద్ధి పనులను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గత సంవత్సరం మార్చిలో ఆలయ ఉద్ఘాటన జరిగింది. రెండు సంవత్సరాలు కావ స్తున్నా భక్తులకు సరైన వసతులు లేవు. కొండపైన విశిష్టత కాపాడాలని.. భక్తులకు ఆధ్యాత్మిక విశిష్టత లేకుండా పోయింది. కొండపైన దీక్షాపరుల మండపం, డార్మిటరీహాల్, విష్ణుపుష్కరిణి, కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దీంతోపాటు ఆలయం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే భక్తులు నిలువ నీడ, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులకు నష్టం.. అవసరం లేకున్నా ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మించి యాదగిరిగుట్ట పట్టణాన్ని రెండుగా విడగొట్టి రూపురేఖలు లేకుండా చేశారని విమర్శలున్నాయి. దీని వల్ల వ్యాపారులు వీధిన పడ్డారు. స్థానికులు నష్టపోయారు. వీరి కోసం దేవస్థానం నిర్మించి ఇచ్చే షాపింగ్ కాంప్లెక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రారంభం కాని గెస్ట్ హౌస్‌లు.. టెంపుల్ సిటీలో దాతల సహాయంతో చేపట్టాల్సిన గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. రూ.250 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేసిన లేఆవుట్ నిరుపయోగంగా ఉంది. స్థానికులకు ఉపాధి దూరం.. ఆలయ అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం, ఇళ్ల స్థలాలు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. సైదాపురంలో కేటాయించిన స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఇల్లు, భూములు కోల్పోయిన బాధితులకు సరైన నష్ట పరిహారం ఇవ్వడంలో, పునరావాసం కల్పించడంలోనూ జాప్యం జరుగుతోంది. సగంలో నిలిచిన పనులు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం అవుతోంది. ప్రస్తుతం చేసిన పనులకు పాత బిల్లులు రూ.70 కోట్ల వరకు, కొనసాగుతున్న పనులను పూర్తి చేయడానికి రూ.70 కోట్ల మేరకు అవసరం అవుతాయి. ఇందులో రూ. 60 కోట్ల మేరకు పనులకు చెక్‌లు ఇవ్వగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దేవస్థానం బస్టాండ్, షాపింగ్ కాంప్లెక్స్, ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచిపోయాయి.గిరి ప్రదర్శన మార్గం పనులు సగభాగంలోనే నిలిచిపోయాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు రూ.1.60లక్షల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశామని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ 1500 మందికి అన్నదానం చేయనున్నట్లు వెల్లడించారు. రోజూ 15వేలకు పైగానే భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం రోజుల్లో 30వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా ఉందన్నారు. 70 మందికి పైగా ఆచార్యులు, పారాయణీకులు, రుత్వికులు రానున్నారని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కొరత రాకుండా లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బస్సుల ఏర్పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయంలో రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఉత్సవాలు యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. శ్రీస్వామిని ఇష్టమైన అలంకార, వాహన సేవలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ముందు, కల్యాణం ఉత్తర మాఢ వీధిలో నిర్వహిస్తాం. రథోత్సవం రోజు శ్రీస్వామి వారు ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవాలి. – కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు ఇవి చదవండి: సికింద్రాబాద్–విశాఖ మధ్య వందేభారత్–2 -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయితే, కార్తీకమాసం చివరి రోజు కావడం, అలాగే ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో, స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. మరోవైపు.. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. ఆలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. -
యాదాద్రిలో తడి బట్టలతో దేవుడి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం.. ఏమన్నారంటే?
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద స్నానం చేశారు. తడిబట్టలతో దేవాలయంలోకి వెళ్లి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు. అర్చకుల వద్ద బండి సంజయ్ ప్రమాణం చేస్తూ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫామ్‌హౌజ్ డీల్ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసినట్టు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక, బండి సంజయ్ యాదాద్రికి వచ్చిన క్రమంలో టీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. మరోవైపు తెలంగాణలో రెండు రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. -
ఉద్ఘాటన ఉత్సవాలకు వేళాయె..
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన ఉత్సవాలు సోమవారం మొదలుకానున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా అంకురార్పణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనం, సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం పూజలతో ప్రారంభమవుతాయి. ఈనెల 28 వరకు జరిగే ఆలయ ఉద్ఘాటన కార్యక్రమంలో ప్రతిరోజూ వివిధ రకాల యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. 108 మంది పారాయణికులు, వేద పండితులు బాలాలయంలో ఏడు రోజులపాటు సప్తాహ్నిక పంచకుండాత్మక యాగం నిర్వహిస్తారు. ఇప్పటికే బాలాలయంలోని మహా మండపంలో పంచ కుండాలను ఏర్పాటు చేసి, అందులోకి ప్రవేశించేందుకు ద్వారాలను సైతం అమర్చారు. యాగ మండపం అంతా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలతో సిద్ధం చేశారు. 28వ తేదీన ఉదయం 11.55 గంటలకు మిథున లగ్న ముహూర్తంలో జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సంప్రోక్షణ తరువాత మధ్యాహ్నం 2గంటలకు భక్తులకు శ్రీస్వామి వారి స్వయంభూ దర్శనాన్ని కల్పించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. పంచ నారసింహ క్షేత్రం అయినందున.. యాదాద్రీశుడు వెలసింది పంచ రూపాలతో కాబట్టి ఈ పంచ నారసింహ క్షేత్రంలో పంచ కుండాత్మక యాగాన్ని నిర్వహించడం చాలా ప్రాముఖ్యమైంది. ఈ యాగంలో ప్రధానంగా కుండాలను ఆయా దిశల్లో ఏర్పాటు చేశారు. చతురస్ర కుండం దీనిని వాసుదేవ కుండం అంటారు. దీన్ని తూర్పు దిశలో ఏర్పాటు చేశారు. ధనుస్సు కుండం దీనిని సంకర్షణ కుండంగా పిలుస్తారు. దీనిని దక్షిణ దిశలో పెట్టారు. వృత్త కుండం దీనిని ప్రద్యుమ్న కుండం అంటారు. దీన్ని యాగశాలలో పశ్చిమ దిశలో ఏర్పాటు చేశారు. త్రికోణం కుండం దీనిని అనిరుద్ర కుండం అంటారు. దీనిని యాగశాలకు ఉత్తర భాగంలో పెట్టారు. ఇక పద్మ కుండం దీనిని అవసఖ్య కుండం అంటారు. ఈ కుండాన్ని ఈశాన్య దిశలో నిర్మించారు. నేటి కార్యక్రమాలు 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వస్తి వాచనం, విష్వక్సేన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, వాస్తు పూజ, వాస్తు బలి, వాస్తు హోమం, వాస్తు పర్వగ్నకరణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి 9.30 వరకు మృత్సంగ్రహణం, అంకురార్పణం, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన ఉంటుంది. 2,167 రోజుల తర్వాత.. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 2016 ఏప్రిల్ 21న గర్భాలయాన్ని మూసివేసి భక్తుల కోసం బాలాలయం నిర్మించి స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు గర్భాలయంలో అర్చకులు స్వామి వారికి పూజలు నిర్వహించినప్పటికి భక్తులకు మాత్రం దర్శన భాగ్యం కలగలేదు. ఈనెల 28న ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభూల దర్శనం కల్పిస్తారు. అంటే 2,167 రోజుల తర్వాత భక్తులకు స్తంబోద్భవుని దర్శనభాగ్యం కలగనుంది. 28 నుంచి బాలాలయం మూసివేస్తారు. 1,200 కోట్లతో నిర్మాణం యాదవ మహర్షి తపస్సుతో కొండ గుహలో వెలసిన పంచ నారసింహుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. పూర్వం కీకారణ్యంలోని గుట్టలో వెలసిన శ్రీస్వామికి భక్తులు పూజలు చేస్తుండే వారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి యాదాద్రి క్షేత్రాన్ని కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. తొలిసారిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద ఆలయం భక్తులకు అందుబాటులోకి వస్తోంది. రూ.1,200 కోట్లతో చేపట్టిన ఈ ఆలయం పునర్మిర్మాణ పనుల్లో ప్రధానాలయానికి రూ.248 కోట్లు ఖర్చుచేశారు. పచ్చదనం, సుందరీకరణ, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞానికి ప్రతీకగా యాదాద్రి నూతన ఆలయం నిలువనుంది. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయానికి వచ్చే భక్తులకు వందల ఏళ్ల క్రితం రాజులు నిర్మించిన పురాతన ఆలయాల అనుభూతి కలగనుంది. -
CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. హుటాహుటిన యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో ఆయన కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. రెండురోజులుగా ఆయన వీక్‌గా ఉన్నారని, ఎడమ చేయి లాగుతోందని చెప్తున్నారని డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. Telangana CM KCR షెడ్యూల్ ప్రకారం ఇవాళ యాదాద్రిలో పర్యటించాలని అనుకున్నారు. అయితే, అస్వస్థతోనే ఆయన పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. దీంతో నేడు జరగాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్‌గానే ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. మరి కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని డిశ్చార్చి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బాలాలయానికి సెలవు!
సాక్షి, హైదరాబాద్: దాదాపు 70 నెలలుగా లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరిన యాదగిరిగుట్ట బాలాలయానికి ఇక సెలవు పలకబోతున్నారు. పునర్నిర్మితమైన యాదాద్రి ప్రధాన దేవాలయం ప్రారంభం కావటానికి ముందే ప్రస్తుతం స్వామి వారు దర్శనమిస్తున్న బాలాలయాన్ని మూసేయనున్నట్టు సమాచారం. మార్చి 28న మహా సుదర్శనయాగం పూర్తి అవుతూనే యాదాద్రి కొత్త దేవాలయంలోకి స్వామి వారి ఉత్సవ, పూజా మూర్తులు వేంచేయనున్నారు. ఆ రోజు సాయంత్రం నుంచే కొత్త దేవాలయంలో స్వామివారు దర్శనమిచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అంతకు వారం ముందే బాలాలయ సేవలను ముగించాలని భావిస్తున్నారు. గండిచెరువు వద్ద యాగశాల.. అత్యద్భుతంగా, రాతి నిర్మాణంగా రూపుదిద్దుకున్న ప్రధాన దేవాలయాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర పద్ధతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమీపంలోని గండి చెరువు వద్ద 75 ఎకరాల స్థలంలో 1,008 హోమగుండాలతో 6 వేల మంది రుత్విక్కుల సమక్షంలో మహా సుదర్శనయాగాన్ని నిర్వహించనున్నారు. ఈ హోమం మార్చి 21న ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. ఈ హోమాన్ని నిత్యం లక్ష మంది చొప్పున భక్తులు దర్శిస్తారని దేవాదాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇంత ఘనంగా నిర్వహించటం, భక్తులు ఇక్కడికే వస్తున్న నేపథ్యంలో, బాలాలయంలోని స్వామివారిని కూడా ఈ హోమశాల వద్దనే ప్రతిష్టించాలని భావిస్తున్నారు. మార్చి 21 నుంచి యాగసమాప్తి అయ్యే 28 ఉదయం వరకు ఇక్కడే స్వామివారి దర్శనాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చిన జీయర్ స్వామితో చర్చించారు. ఆయన అంగీకారం తెలిపిన తర్వాత దీనిపై ప్రకటన చేయాలని నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అదే సమయంలో ఇతరత్రా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే ప్రస్తుత బాలాలయాన్ని అలాగే నిర్వహించాలని భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఆరేళ్లపాటు బాలాలయంలో.. దేవాలయ జీర్ణోద్ధరణ సమయంలో బాలా లయాన్ని నిర్మించి ప్రధాన ఆలయంలోని మూల విరాట్టు రూపానికి ప్రాణప్రతిష్ట చేసి అందులో ప్రతిష్టించటం ఆనవాయితీ. ఉత్సవమూర్తులను కూడా అందులోనే ప్రతిష్టించి యథాప్రకారం నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. దేవాలయ జీర్ణో ద్ధరణ పూర్తయిన తర్వాత, కొత్తగా నిర్మించిన గర్భాలయంలోకి దేవేరులను తరలిస్తారు. యాదాద్రి జీర్ణోద్ధరణ పనులు 2016లో ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయం వద్ద పనులు ప్రారంభించే సమయానికి బాలాలయాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయానికి కాస్త దిగువన ప్రధాన ఆలయ గర్భాలయాన్ని తలపించే రీతిలో తాత్కాలిక పద్ధతిలో దీన్ని నిర్మించారు. అదే సంవత్సరం ఏప్రిల్ 21న అందులో స్వామివారికి ప్రాణప్రతిష్ట చేశారు. అప్పట్నుంచీ ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు బాలాలయమే యాదగిరీశుడి నిలయంగా మారి భక్తులకు దర్శనభాగ్యం కల్పించటం విశేషం. ప్రధాన దేవాలయం నుంచి బాలాలయంలోకి, బాలాలయం నుంచి మరో వేదిక, అక్కడి నుంచి మళ్లీ ప్రధాన దేవాలయంలోకి.. ఇలా స్వామివారు మూడు ప్రాంతాల్లో కొలువు దీరి దర్శనమివ్వటం ఓ అరుదైన ఘట్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Yadadri Temple: ‘మేఘా’ 6 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: యాదాద్రి దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు సుమారు 32 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరఫున ఆరు కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆరు కేజీల బంగారం లేదా సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో త్వరలో అందజేస్తామని ప్రకటించారు. ప్రతిష్టాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచల మేరకు మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి సంస్థ తరఫున 2 కిలోల బంగారాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు తమ సంస్థ (జలవిహార్) తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. విరాళాల కోసం బ్యాంక్ ఖాతా స్వర్ణ తాపడానికి భక్తులు విరాళాలు సమర్పించడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్ యాదగిరిగుట్ట శాఖలో ఖాతా తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి కోరారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంక్ ద్వారానే తీసుకోనున్నామని తెలిపారు. బంగారం విరాళంగా ఇస్తే స్వచ్ఛత విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు నగదు రూపంలో బ్యాంకులో జమచేయాలని సూచించారు. -
యాదాద్రి ఆధ్యాత్మికత ఉట్టిపడాలి
సాక్షి, హైదరాబాద్: ‘భారతదేశంలోని పలు ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పనుల వేగాన్ని పెంచి మరో రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునే దిశగా ఆలయ అధికారులు పూనుకోవాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపిన యాదాద్రి ఆలయం, నిర్మాణాలు పూర్తి చేసుకునే సమయానికి మరింతగా ప్రాచుర్యాన్ని పొందుతుందన్నారు. ప్రభుత్వం కూడా యాదాద్రి ప్రాశస్త్యాన్ని భక్తలోకానికి తెలియచెప్పే విధంగా సమాచారాన్ని అందిస్తుందని, చివరి అంకానికి చేరుకున్న నిర్మాణాల్లో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా వుండాలన్నారు. ఆలయ పరిసరాలన్నీ ప్రశాంతతతో అలరారేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యత మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన టూరిస్టులు, భక్తులు యాదాద్రిని దర్శించే అవకాశాలుంటాయన్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం, టెంపుల్ టౌన్, కాటేజీలు, బస్టాండ్, ఆలయ పరిసర ప్రాంతాల సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, గుట్టమీదికి బస్సులు వెళ్లే మార్గాలు, వీఐపీ కార్ పార్కింగ్, కల్యాణకట్ట, పుష్కరిణి ఘాట్లు , బ్రహ్మోత్సవ, కల్యాణ మండపాలు, పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. అయోధ్య, అక్షరధామ్ శిల్పులను రప్పించండి క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయానికి తుదిమెరుగులు దిద్దేందుకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు పనిచేసిన అనుభజ్ఞులైన శిల్పులను పిలిపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఆర్టీసీ డిపో స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాల కోసం వినియోగించుకుంటున్న నేపథ్యంలో బస్‌స్టేషన్ నిర్మాణానికి గుట్ట సమీపంలో ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 11 ఎకరాల స్థలంలో మూడువేలకు పైగా కార్లు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పూర్తిగా శాకాహారం అందించే ఫుడ్ కోర్టులను నిర్మించాలని, ఇందులో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ వంటకాలను అందించాలన్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ భవిష్యత్తులో పచ్చదనం శోభిల్లే విధంగా మొక్కలను నాటాలన్నారు. వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్లను నాటాలన్నారు. యాదాద్రికి సమీపంలోని గండి చెరువును అత్యద్భుతమైన ల్యాండ్ స్కేపింగుతో, వాటర్ ఫౌంటెయిన్లతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలుగా సుందరీకరణ పనులుండాలన్నారు. 90 ఎకరాల్లో భక్తి ప్రాంగణం యాదాద్రి టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రతి యాభై కాటేజీలకు ప్రత్యేక డిజైన్ ఉండాలన్నారు. భక్త ప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను కాటేజీలకు పెట్టుకోవాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంపై సీఎం ఆరా తీశారు. వేలాది మంది హాజరయ్యే విధంగా కల్యాణ మండపాల నిర్మాణాలుండాలన్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్ర సంగాలు, స్వాములతో ప్రవచనాలను కొనసాగించేందుకు లక్షలాది మంది కూర్చునే విధంగా తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని సీఎం చెప్పారు. దేవాలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలన్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరును సీఎం ఆదేశించారు. -
యాదాద్రిలో ఆర్జిత సేవలు ప్రారంభం
సాక్షి, యాదగిరిగుట్ట : ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 కారణంగా మార్చి 22 నుంచి రద్దు అయిన ఆర్జిత సేవలు 196 రోజుల తర్వాత పున:ప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారి దర్శనానికి దాదాపు రెండు నుంచి నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. భక్తుల రద్దీ ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కనిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించే క్రమంలో థర్మల్ స్క్కీనింగ్,శానిటైజర్ ఏర్పాటు చేశారు. ఆదివారం (నేటి) నుంచి శ్రీస్వామి వారి ఆర్జిత సేవలైన అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన పూజలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు చేసుకునేందుకు భక్తులను అనుమతించినట్లు ఈవో గీతారెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా భక్తులు మొక్కులుగా సమర్పించే తలనీలాలు సమర్పించే కల్యాణ కట్టను సైతం తెరిచినట్లు తెలిపారు. కొండ కింద గల తులసీ కాటేజీలో సైతం ఒక కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికే గదులు కేటయిస్తామన్నారు. వీటన్నింటికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి, కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపించనున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వేకువజామున 4గంటలకు తెరచి రాత్రి 9.45గంటల వరకు ఆలయంలో పూజలు జరిపించనున్నట్లు తెలిపారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఇక యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆర్జిత సేవలను ప్రారంభించనున్నట్లు ఈవో వెల్లడించారు. అంతే కాకుండా ఆలయ దర్శన వేళలను మార్పు చేసినట్లు తెలిపారు. వేకువ జామున 4 గంటల నుంచి రాత్రి 9.45గంటల వరకు నిత్య కైంకర్యాలను కొనసాగిస్తామన్నారు. ఇక శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాల ఆలయంలో నిత్య కైంకర్యములు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పూజలన్నీ కోవిడ్–19 నిబంధనల ప్రకారం జరిపిస్తామన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొనే ప్రతి భక్తుడు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె సూచించారు. ఆరు నెలల తరువాత ఆర్జీత సేవలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 6నెలల 11 రోజుల తరువాత ఆర్జిత సేవలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 22వ తేదీన లాక్డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాదాద్రి ఆలయంలో భక్తులచే జరిపించే ఆర్జిత సేవలను దేవాదాయశాఖ ఆదేశాలతో రద్దు చేశారు. ఇక జూన్ 8వ తేదీ నుంచి భక్తులను శ్రీస్వామి వారి దర్శనానికి అనుమతిచ్చి, ఆన్లైన్లో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తుల పేరుతో పూజలు జరిపించారు. ఇక లాక్డౌన్లో వచ్చిన సడలింపులతో ఆదివారం కోవిడ్–19 నిబంధనలతో భక్తులకు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు అనుమతిచ్చారు. -
‘యాదాద్రి’లో ఆకర్షణీయమైన క్యూలైన్లు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నార్మాణంలో భాగంగా క్యూలైన్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఈ నెల 13వ తేదీన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ క్యూలైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అంతే కాకుండా వాటిలో పలు మార్పులు చేశారు. ఈ క్యూలైన్లకు సంబంధించిన ఏర్పాట్లను వైటీడీఏ అధికారులు త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఆర్కెటెక్టు ఆనంద్ సాయి పర్యవేక్షణలో నూతన క్యూలైన్ల డిజైన్లు రూపుదిద్దుకుంటున్నాయి. డిజైన్లకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసే క్యూలైన్లకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇటీవల ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రధాన ఆలయంలో క్యూలైన్లకు సంబంధించిన పవర్ ప్రజంటేషన్ ఆర్కెటెక్టు ఆనంద్‌సాయి ఇచ్చారు. క్యూలైన్ అద్భుతంగా ఉండటంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేసి, వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఆలయానికి వచ్చే భక్తులు క్యూలైన్లలో వెళ్లేటప్పుడు ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉండేందుకు వైటీడీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో క్యూలైన్లను పెంచే విధంగా, భక్తులు లేని రోజుల్లో క్యూలైన్లను ఒకే దగ్గరికి చేర్చే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూలైన్లు ఏ మార్గంలో వస్తుందనే అంశాలపై గతంలోనే లక్నోకు చెందిన అనుభవం ఉన్న టెక్నీషియన్స్ యాదాద్రి ప్రధాన ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. క్యూలైన్లలో పలు మార్పులు ఆలయంలోకి భక్తులు శ్రీస్వామి దర్శనానికి వెళ్లే సమయంలో ఏర్పాటు చేసే క్యూలైన్లపై అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు, సలహాలు, మార్పులు, చేర్పులు చేశారు. నూతనంగా నిర్మాణం అయ్యే ప్రసాదం కౌంటర్ నుంచి బ్రహ్మోత్సవ మండపం వెనుక నుంచి అష్టభుజి ప్రాకార మండలంలో నుంచి తూర్పు రాజగోపురం కింది నుంచి ఒక లైన్, బ్రహ్మోత్సవ మండపం నుంచి అష్టభుజి ప్రాకార మంపం నుంచి దక్షిణ రాజగోపురం కింది నుంచి ప్రధాన ఆలయంలోకి వెళ్లే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.అంతే కాకుండా దర్శనం అనంతరం భక్తులు నేరుగా పడమటి రాజగోపురం నుంచి బయటకు వెళ్లకుండా ఆలయ నిర్మాణాలు, ఆధ్మాత్మిక కట్టడాలు చేసేందుకు వీలుగా క్యూలైన్లు ఉండాలని సూచనలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయంలో రెండు వరుసల లైన్లు స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లలను అద్భుతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే వైటీడీఏ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే ప్రసాదం కాంప్లెక్స్ నుంచి తూర్పు రాజగోపురం వరకు 16 ఫీట్ల వెడల్పుతో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యూలైన్ తూర్పు రాజగోపురం వరకు ముగియగానే అక్కడి నుంచి భక్తులు ఆలయంలోకి వెళ్లేందుకు ఆకర్షణీయమైన క్యూలైన్లు రానున్నాయి. ఇక ఆలయంలోకి వెళ్లినాక 10ఫీట్లతో క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ పది ఫీట్ల వైడల్పుతో వచ్చే లైన్లో రెండు లేదా మూడు క్యూలైన్లు రానున్నట్లు తెలిసింది. ఒక క్యూలైన్ మార్గంలో భక్తులు దర్శనానికి వచ్చేది. మరొకటి దర్శనం అనంతరం భక్తులు వెళ్లడానికి, మూడవ క్యూలైన్ ఆలయంలోకి ఆచార్యులు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు వరుసల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో భక్తులతో పాటు ఆచార్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసే విధంగా వైటీడీఏ అధికారులు ఆలోచిస్తున్నారు. బంగారు వర్ణంలో.. ఇప్పటికే ఆలయాన్ని అంతా బంగారు వర్ణంలో తీర్చి దిద్దేందుకు వైటీడీఏ అధికారులు కృషి చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ, ఆలయంలోని ప్రధాన గర్భాల ద్వారాలు, విమాన రాజగోపురం వంటివి బంగారు రంగులో మెరిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే క్యూలైన్లను సైతం బంగారు రంగులోనే ఉండే విధంగా చేస్తున్నారు. విశాలమైన క్యూలైన్లు, మధ్యల మధ్యలో భక్తులు కూర్చోవడానికి బెంచీలు, అక్కడక్కడ ఆధ్మాతిక చిత్రాలు ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయనున్నారు. -
‘యాదాద్రి’ వెలవెల..!
యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో ఆచార్యులు బుధవారం ఆస్థానపరమైన పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంతో పాటు యాదాద్రి క్షేత్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో శుక్రవారం వరకు భక్తులకు శ్రీస్వామి దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు. ముందస్తుగా సమాచారం లేకపోవడంతో చాలా మంది భక్తులు ఆలయ ఘాట్ దారి వద్దకు వచ్చి దర్శనాలు నిలిపివేశారని పోలీస్ సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. దీంతో ఆలయ పరిసరాలు బోసిబోయాయి. ఆస్థాన పరంగా పూజలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం ఆచార్యులు ఏకాంతంగా, ఆస్థానపరంగా నిత్య పూజలను కొనసాగించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన ఆచార్యులు సుప్రభాత సేవ చేపట్టిన ప్రతిష్ఠామూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఇక ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం యాదాద్రీశుడికి శ్రీసుదర్శన నారసింహ హోమం చేపట్టారు. సాయంత్రం ఆలయంలోనే సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి వారికి నివేదన జరిపించి శయనోత్సవం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి ఆలయంలోకి భక్తులను రానివ్వకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. వైకుంఠద్వారం వద్ద మొక్కులు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి భక్తులను అనుమతించకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీస్వామి దర్శనానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. మొదటిఘాట్ రోడ్డు నుంచి వెనుదిరిగిన భక్తులు స్థానికంగా ఉన్న వైకుంఠద్వారం వద్ద టెంకాయలు కొట్టి భక్తులు మొక్కులు తీర్చుకొని వెళ్లిపోయారు. నేటి నుంచి గుట్ట పట్టణం లాక్డౌన్.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీని స్వచ్ఛందంగా లాక్డౌన్ చే స్తున్నట్లు ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్‌గౌడ్ ప్రకటించారు. పట్టణంలో కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కరోనాను కట్టడి చేయడానికి గురువారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పట్టణాన్ని సంపూర్ణంగా లాక్డౌన్ చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిత్యావసర దుకాణాలు తెరుస్తామని పేర్కొన్నారు. కల్యాణ మండపం పనులు వేగిరం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చెందుతున్న అనుబంధ ఆలయమైన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ పనులు వేగంగా జరుగుతున్నాయి. శివాలయానికి ఆలయానికి ఉత్తర ప్రాకార మండపం పక్కన నిర్మాణం చేస్తున్న స్వామి వారి కల్యాణ మండపం ఇప్పటికే ఫిల్లర్లు నిర్మించారు. మరో రెండు రోజుల్లో కల్యాణ మండపానికి స్లాబ్ వేసే పనులు చేయనున్నారు. పనులు వేగవంతం చేయాలి: వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు అధికారులకు సూచించారు. బుధవారం ఆలయ ఈఓ గీతారెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. తూర్పు రాజగోపురం సమీపంలోని బ్రహ్మోత్సవ మండపం వద్ద కొనసాగుతున్న స్టోన్ ఫ్లోరింగ్ పనులను చుశారు. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం నుంచి యాదాద్రి క్షేత్రానికి తీసుకొచ్చిన శంకు, చక్ర, నామాలు, ఏనుగులు, గరుత్మంతుల విగ్రహాలతోపాటు ప్రధాన ఆలయంలోని ఆళ్వారు పిల్లర్లు, అద్దాల మండపం పనులను పరిశీలించారు. అనంతరం శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వస్వామి ఆలయాలు, ప్రసాదం కాంప్లెక్స్‌లో నిర్మాణం జరుగుతున్న కౌంటర్లను చూసి, పలు సూచనలు, సలహాలు చేశారు. రాజగోపురం వద్ద ఉన్న విగ్రహాలు నలు దిశలా.. భక్తులను ఆకర్షించే విధంగా.. ఆలయంలో ప్రాకారాల్లో విగ్రహాల ఏర్పాటుకు కసరత్తు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయానికి నలు దిశల కృష్ణ శిలతో తయారు చేసిన వివిధ దేవతామూర్తులు, అబ్బుర పరిచే విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు శిల్పులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులోని మహాబలిపురం నుంచి యాదాద్రి కొండపైకి చేరుకున్న గరుఢ్మంతులు, ఐరావతాలు, సింహాల విగ్రహాలను ఆలయానికి నలు దిశలు అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందుకు సంబంధించి తూర్పు రాజగోపురం వద్ద ఉన్న ఈ విగ్రహాలను బుధవారం ప్రధాన ఆలయంలోకి చేర్చారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజగోపురాలకు ముందు భాగంలో ఏనుగుల విగ్రహాలు, ఆలయంలోకి భక్తులు ప్రవేశించే మార్గాల్లో సింహాల విగ్రహాలు, ఇక ఆలయానికి ప్రాకార మండపాలపై గరుఢ్మంతుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు శిల్పులు సన్నద్ధం అవుతున్నారు. -
కావాలని షూతో మెట్లు ఎక్కలేదు : విప్ సునీత
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సం దర్శించారు. ఉదయం 11గంటలకు యాదాద్రి కొండపైకి చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు 11.02 గంటలకు బాలాలయానికి చేరుకున్నారు. బాలాలయం ప్రధాన ద్వారం వద్ద ఆల య ఆచార్యులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా వారికి స్వాగతం పలికారు. ప్రతిష్టామూర్తులకు గవర్నర్ తమిళిసై దంపతులు విశేషంగా పూజలు నిర్వహించారు. సుమారు 19నిమిషాల పాటు పూజలు చేశారు. అనంతరం మహా మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ ఆచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు. గవర్నర్‌కు ఘన స్వాగతం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం ఫలికారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలకగా.. కలెక్టర్ అనితరాంచంద్రన్ మొక్కను అందజేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళిసై పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆలయ అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విప్ సునీత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అనుకున్న సమయానికి ఆలయానికి రాలేదు. గవర్నర్ దంపతులు క్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో ఐదు నిమిషాలు ఆలస్యంగా విప్ సునిత వచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్తున్న తొందరలో తన కాళ్లకు ధరించిన షూ ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై వదిలి వెళ్లారు. వాటిపై భక్తుల్లో చర్చ జరిగింది. కావాలని షూతో మెట్లు ఎక్కలేదు శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన హడావుడిలో అనుకోకుండా షూతో ఐదు మెట్లు ఎక్కానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలని షూతో మెట్లు ఎక్కలేదని తెలిపారు. -
నల్గొండ అందాలు చూసొద్దామా !
సాక్షి, నల్గొండ : ఉమ్మడి జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లను వీక్షించడానికి ఎంతో మంది వస్తుంటారు. శాతవాహన ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న లక్ష్మీనరసింహదేవాలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది. తనివి తీరని అందాల పేట, జాలువారే జలపాతాలకు నిలయం చందంపేట. రాచకొండ ప్రకృతి రమణీయతకు మారు పేరు. ఇక్కడి సెలయేళ్లు, జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలా చూడదగ్గ ప్రాంతాలెన్నో ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. యాదాద్రిని చూసొద్దాం రండి.. యాదగిరిగుట్ట (ఆలేరు) : పంచనారసింహ క్షేత్రంగా.. ఏకశిఖరుడి ఆలయంగా.. హరిహరులు కొలువైన గొప్ప మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం గొప్పగా రూపుదిద్దుకుంటుంది. స్వామి సన్నిధిలో శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి, శ్రీసీతారాముల ఆలయాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు శ్రీసత్యనారాయణస్వామి వత్ర మండపం ఉంది. పాతగుట్ట క్షేత్ర మహత్యం.. యాదాద్రిలో వెలిసే కంటే ముందుగా శ్రీస్వామి అమ్మవార్లు లక్ష్మీ అమ్మవారితో సహా ఒక ఆరణ్యంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. క్రమంగా ఈ ప్రాంతమే పాతగుట్టగా మారింది. ఇక్కడికి స్వామి వారు అమ్మవారితో గుర్రంపై వచ్చాడని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ మరో విష్ణు పుష్కరిణి ఉంది. గుట్టలో చూడదగ్గ ప్రదేశాలు.. యాదగిరిగుట్ట పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో శ్రీలక్ష్మీహయగీవ్ర ఆలయం, టెంపుట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న పెద్దగుట్ట, పాతగుట్ట రోడ్డులో సాయిబాబా ఆలయం, రెండు కిలోమీటర్ల దూరంలోని మైలార్‌గూడెం గ్రామంలో సాయినాథ ఆలయం, మెయిన్‌రోడ్డులో వైకుంఠద్వారం, తులసీకాటేజీలో యాదరుషి విగ్రహం ఆకట్టుకుంటున్నాయి. యాదగిరిగుట్టకు 4కిలోమీటర్ల దూరంలో ప్రాచీన వీరభద్రస్వామి ఆలయం, మినీ ట్యాంక్బండ్లు ఉన్నాయి. అదేవిధంగా ఆర్యవైశ్య సత్రానికి చెంది న లోటస్ టెంపుల్, వాసవీమాత ఆలయం ఉంది. పసిడిగొండ.. ఉండ్రుగొండ పచ్చనిచెట్లతో నిగనిగలాడే ప్రకృతి సంపద, ఎత్తైన దుర్గం ప్రాకారాలు, 20 దర్శనీయ ఆలయాలు, ఎటుచూసినా కొండలు.. లోయలు, విలువైన ఔషధ మొక్కలతో అలరారుతున్న ప్రదేశం చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం ఆవాసం ఉండ్రుగొండ. హైదరాబాద్– విజయవాడ మార్గంలో 64 వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు, సూర్యాపేటకు 13 కిలో మీటర్ల దూరంలో ఈ గిరదుర్గం కొలువై ఉంది. గిరిదుర్గంపై వెలిసిన ఆలయాలు... ఉండ్రుగొండ కోట విస్తీర్ణం 11 కిలోమీటర్లు, ఎత్తు 900 మీటర్లు. 1376 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ గిరిదుర్గంపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, గోపాల స్వామి, శివాలయం, లింగమంతులస్వామి, మల్లేశ్వరస్వామి, 14 కిమీ పొడవైన దుర్గ ప్రకారాలు, రాతితో నిర్మించిన రాజుల దర్వాజాలు ఉంటాయి. లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న గుట్టను కాపురాల గుట్ట, పెద్దగుట్ట అని పిలుస్తారు. ఈ గుట్టలో చాకలి బావి, మంత్రిబావి ఉన్నాయి. వాటిలో ఇప్పటికి నీరు ఉంది. కాకతీయుల కాలంలో ఈ కట్టడాలు నిర్మించినట్లుగా చెబుతుంటారు. గుట్టలను కలుపుతూ సొరంగాలు... గిరిదుర్గంలో ఉన్న ఏడు గుట్టల చుట్టూ రాతి కట్టడాలు నిర్మించడంతో పాటు వాటిని కలుపుతూ సొరంగ మార్గాలు ఉన్నాయి. గుట్టపై ఓ చోట దర్వాజ నుంచి నేరుగా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి శివాలయాల వరకు దారి ఉన్నట్లుగా పురాణాలు చెబుతున్నా యి. శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన గుట్ట కు ఎదురుగా దక్షిణం వైపు పెద్ద కోనే రు ఉంది. ఇందులో ఎప్పటికీ నీరు ఉంటుంది. నాటి జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం.. ఘనమైన చరిత్ర కలిగిన దేవరకొండ ఖిలా నాటి జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. 700 సంవత్సరాలకు పూర్వం రాచరిక పాలన, శిల్పకళా సంపద కళ్లకు కట్టినట్లు ఖిలాలో కనిపిస్తాయంటే అతిశయోక్తి లేదు. క్రీ.శ.1230లో రేచర్ల పద్మనాయక వెలమరాజుల రాజ్యానికి దేవరకొండ ఖిలా రాజధానిగా ప్రఖ్యాతి గడించింది. ఖిలాపై నిర్మించిన రాతి కట్టడాలు ఆనాటి శిల్పవైభవానికి నిదర్శనంగా నిలిచాయి. దేవరకొండ ఖిలా దుర్గంలో సుమారుగా 300లకుపైచిలుకు చిన్న, పెద్ద బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, ఇతరత్రా దిగుడు బావులు, కోనేరులు, ధాన్యాగారాలు ఎన్నో ఉన్నాయి. సాగర సోయగం.. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ బౌద్ధమతస్థులకు, పర్యాటక ప్రేమికులకు రానున్న రోజుల్లో కేంద్ర బిందువు కానుంది. నాగార్జునుడు నడయాడిన నందికొండ ప్రాంతం తవ్వకాల్లో లభ్యమైన శాతవాహన ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక నిర్మాణాలు, మహాయాన బౌద్ధమత అవశేషాలు నాగార్జునకొండలో భద్రపరిచారు. ఇక్కడ ఆచార్యనాగార్జునుడు ఏర్పాటు చేసిన బౌద్ధవిశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆరామాలు, విహారాలు, స్తూపాలు, మండపాలు నేటికీ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. నాగార్జునకొండ మ్యూజియంలో ప్రత్యేకంగా భద్రపరిచిన బుద్ధదాతువులు నేటికీ బౌ ద్ధమతస్థుల నుంచి ప్రత్యేక పూజలందుకుం టున్నాయి. తవ్వకాల్లో మహాస్థూపం మధ్యలో మట్టికలశం, రాగి కలశం, వెండి కలుశం దానిలోపల బంగారు కలశం, వెండి బంగా రు పుష్పాల మధ్యన బుద్ధదాతువులు లభ్యమయ్యాయి. వీటిలో కొన్నింటిని అప్పట్లో సారనాథ్‌కు తరలించగా మరికొన్ని నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధవనం.. నాగార్జునసాగర్‌లో 279 ఎకరాల్లో నిర్మాణమవుతున్న శ్రీపర్వతారామం పేరుతో పిలువబడే బుద్ధవనం తెలంగాణ సిగలో మణిలా మెరువనుంది. ఆసియాలోనే పెద్దదైన కాంక్రీట్ మహాస్థూపంతో పాటు బుద్ధుడి జీవిత దశలు తెలిపే బుద్ధచరిత వనం, జాతక వనంతో పాటు ప్రపంచంలోని పలుదేశాల్లో ఉన్న స్థూపాల నమూనాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పర్యాటక కేంద్రం.. పానగల్లు జిల్లా కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు ఒకప్పటి కాకతీయ సామంతరాజుల పరిపాలనలో విలసిల్లిన పట్టణం. ఇక్కడి ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, మ్యూజియం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఛాయా సోమేశ్వరాలయం.. ఇది త్రికూటాలయం. దక్షిణముఖద్వారంతో తూర్పు వైపున సూర్యుడు, ఉత్తర దిక్కున విష్ణు మూర్తి, పడమరన శివాలయం కలిగి ఉన్నాయి. ఈ శివాలయంపై వెలుతురు ఉన్నంత సేపు చిక్కటి నీడ పడుతుండటంతో ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వరాలయంగా పేరు వచ్చింది. పచ్చల సోమేశ్వరాలయం.. ఇది పానగల్లు నడిబొడ్డున ఉన్న శివాలయం. ఇక్కడి ప్రధాన ఆలయంలో నవరత్నాలలో ఒక్కటైన పచ్చ పొదిగి ఉండడంతో ఈ ఆలయానికి పచ్చల సోమేశ్వరాలయంగా పేరు వచ్చింది. ప్రధాన ఆలయం వెనుక భాగంలో శివపురాణం చెక్కబడి ఉంది. మ్యూజియం.. మ్యూజియంలో పానగల్లు ప్రాంతంలోనేకాక ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో లభించిన శిల్ప సంపద, శాసనాలు, రాతి శిలాయుగపు ఆయుధాలు, అప్పటి రాజులు వాడిన కత్తి, రాళ్లు ఇక్కడ భద్రపరిచారు. పరవశింపజేసే ప్రకృతి అందాలు చుట్టూ కొండలు, జాలువారే జలపాతాలు, పచ్చని రంగు అల్లుకున్న పంట పొలాలు, మనుసును పరువశింపజేసే ప్రకృతి అందాలు, కృష్ణమ్మ పరవళ్లు, అరకును తలపించే దేవరచర్ల అందాలు, బుర్ర గుహలను తలపించే గాజుబిడెం గుహలు, అధ్యాత్మికతను పెంచే ఆలయాలు, సుమారు 300 ఏళ్ల కాలం నాటి బృహత్కాల సమాధులు చూడాలంటే ఒక్కసారి చందంపేటకు వెళ్లాల్సిందే. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పెద్దమునిగల్ అంభ భవాని ముత్యాలమ్మ దేవాలయం, వైజాక్ కాలనీ జలాలు, కాచరాజుపల్లి గాజుబిడెం గుహలు, వైజాక్ కాలనీలో బోటింగ్, ఏలేశ్వరం మల్లయ్య గట్టు, జింకల పార్క్ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వెళ్లాల్సింది ఇలా.. హైదరాబాద్–నాగార్జునసాగర్ జాతీయ రహదారి నుంచి కొండమల్లేపల్లికి చేరుకొని అక్కడి నుంచి దేవరకొండకు చేరుకోవాలి. దేవరకొండ, డిండి మార్గమధ్యంలోని పెద్దమునిగల్ స్టేజీ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కొత్తపల్లి మీదుగా 20 కి.మీ. ప్రయాణిస్తే.. పెద్దమునిగల్ అంభ భవాని దేవాలయం వస్తుంది. అక్కడి నుంచి 7 కి.మీ. దూరంలో ఉన్న వైజాగ్ కాలనీకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి వైజాగ్ కాలనీ వద్ద కృష్ణానది వెనుక జలాల్లో బోటింగ్ చేయడంతోపాటు ఏలేశ్వరం మల్లయ్యగట్టు, జింకల పా ర్క్కు మరబోట్ల ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరో ఐదు కి.మీ. ప్రయాణిస్తే కాచరాజుపల్లి గ్రామానికి చేరుకుంటాం. ఆ గ్రామం నుంచి రెండు కి.మీ. ప్రయాణిస్తే గాజుబిడెం తండా వస్తుంది. అక్కడి నుంచి కాలినడకన వెళ్తే గాజుబిడెం గుహలు వస్తాయి. అక్కడ నుంచి 12 కి.మీ. ప్రయాణిస్తే సర్కిల్‌తండా గ్రామం వ స్తుంది. అక్కడి నుంచి చందంపేట మార్గమధ్యలోని సర్కిల్ తండా నుంచి 8కి.మీ. ప్ర యాణిస్తే అరకు అందాలను తలపించే దేవరచర్ల గ్రామానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 2కి.మీ. కాలినడకన ప్రయాణిస్తే దేవరచర్ల మునిస్వామి ఆలయానికి చేరుకుంటాం. ప్రకృతి అందాల రాచకొండ రాచకొండ తెలంగాణ ప్రాంతానికి ఆనాడు రాజధానిగా వెలిసిన గొప్ప నగరం. తెలంగాణ ప్రాంతమంతటికీ పద్మనాయక వంశీ యుల ఏలుబడిలో రాజధానిగా చరిత్ర పుట్టల్లో నిలిచింది. రాచకొండ యాద్రాది జిల్లా సరిహద్దులో సంస్థాన్‌నారాయణపురం మండల పరిధిలో ఉంది. ఇది హైదరాబాద్ నగరానికి 40కి.మీ, మండల కేంద్రం నుంచి 20కి.మీ, చౌటుప్పల్ నుంచి 30కి.మీ.దూరంలో ఉంది.పద్మనాయక వంశీయులు కాలంలో నిర్మించిన దుర్గములలో రాచకొండ ఒకటి. పద్మనాయక వంశంలో ఎర్రదాచనాయుడుతో మొదలైన చరిత్రలో సర్వజ్ఞ రావు సింగ భూపాలుడు (సర్వజ్ఞ సింగ భూపాలుడు) ప్రభువు చివరి వాడు. ఈయన కాలంలో ఎన్నో ఉజ్వల ఘట్టాలు చరిత్రలో చోటు చేసుకున్నాయి. కళలు, సాహిత్యానికి పద్మవంశీయుల కాలం స్వర్ణయుగం. ఆయన ఎన్నో అపూర్వమైన కట్టడాలు నిర్మించారు. రాచకొండ రెండు పర్వతములపై నిర్మించబడినది. ఒకటి రాజు కొండ, రెండోవది నాగనాయుని కొండ. ఈ రెండిటి చుట్టూ పెద్దపెద్ద రాళ్లతో ప్రాకార దుర్గములను నిర్మించారు. శత్రువులు కూడా ప్రవేశించలేనంత కట్టడం. గృహ ప్రాంగణాలు, పుర వీధులు నేటి ఆధునిక సాంకేతికత కంటే గొప్పగా ఉన్నాయి. అపూర్వమైన రాజ భవనం, సభా మందిరం, రాచనగరం శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సంకేళ్ల బావితో పాటు చెరువులున్నాయి. రాచకొండలో పురాతన రామాలయం ఉంది. అక్కడ బమ్మెరపోతన పూజలు చేశాడని చరిత్ర చెబుతోంది. గుçప్త నిధుల తవ్వకాల్లో అతి పెద్ద శివలింగం బయటపడింది. ఈ శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఇక్కడ దేవాలయం నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాచకొండ అటవీలో ఆకట్టుకునేవి జాతీయ పక్షి నెమలి, నక్షత్ర తాబేళ్లు. -
అభయాంజనేయుడు కొలువుదీరేనా?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి క్షేత్రపాలకుడిగా భారీ ఆకృతిలో భక్తులకు దర్శనమివ్వాల్సిన ఆంజనేయస్వామి విగ్రహానికి ఇబ్బంది వచ్చి పడింది. దేవాలయాన్ని భారీఎత్తున అభివృద్ధి చేస్తూ పూర్తిగా పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో క్షేత్రపాలకుడైన హనుమంతుడి భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద క్షేత్రాల్లో ఎక్కడా లేనట్టుగా ఏకంగా 108 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెరసి కొత్తరూపు సంతరించుకుని దివ్యక్షేత్రంగా వెలుగొందే మహా మందిరానికి ఈ భారీ ఆంజనేయ విగ్రహమే ప్రధానాకర్షణగా నిలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ భారీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో పునరాలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంత బరువైన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే కట్టడానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నేపథ్యంలో యాదాద్రి అభివృద్ధి సంస్థ పునరాలోచనలో పడింది. అఖండ శిల కాకపోవటమే కారణం... యాదగిరీశుడు గుట్టపై కొలువుదీరి ఉన్నాడు. ఇది స్వయంభూక్షేత్రంగా అనాదిగా విరాజిల్లుతోంది. విశాలమైన గుట్ట కావటంతో పైభాగంలో 14.11ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసి మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 2.33 ఎకరాలు కేవలం ప్రధానాలయానికే కేటాయించారు. మిగతా వాటిల్లో తిరుమల తరహాలో నాలుగు మాడవీధులు, బ్రహ్మోత్సవ కల్యాణ మండపం, సత్యనారాయణ స్వామి వ్రతాల మండపం, విశ్రాంతి మందిరం, యాగశాల, పుష్కరిణి, రెండు ప్రాకారాలు, హనుమదాలయం, శివాలయం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడే 108 అడుగుల ఎత్తుతో అభయాంజనేయుడి కాంస్య విగ్రహానికి స్థలాన్ని కేటాయిం చారు. అదంతా గుట్ట కావటంతో, విగ్రహానికి ప్రతిపాదించిన స్థలంలో అడుగుభాగం అఖండరాయిగా భావించారు. ఇటీవల ప్రాకార నిర్మాణానికి పునాదులు తవ్వగా అడుగున అఖండ రాయి కాదని, అది వదులుగా ఉన్న రాతి పొర లని తేలింది. దీంతో ఎక్కువ లోతుకు తవ్వి ప్రాకార నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడదే ఆందోళనకు కారణమవుతోంది. అలాంటి రాతి పొరలపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు సరికాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి విగ్రహం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తేల్చాలని అధికారులు కోరటంతో నిపుణులు ఆ పని ప్రారంభించారు. నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, భారీ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తే అది మందిర కట్టడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రాథమికంగా వారు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టి మిగతా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. జూన్ నాటికి ఆలయ పైభాగం నిర్మాణం పూర్తి చేసి, దసరా నాటికి మిగతా పనులు కొలిక్కి తెచ్చి ఆ వెంటనే ప్రధాన గర్భాలయంలోకి బాలాలయంలో ఉన్న స్వామి ఉత్సవ మూర్తులను తరలించాలని నిర్ణయించారు. దసరా తర్వాత మంచి ముహూర్తం గుర్తించి ప్రధానాలయంలోనే లక్ష్మీనారసింహుడు భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొంటున్నారు. నిపుణులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొలువైన ఆంజనేయుడే భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
యాదగిరీశుడిని దర్శించుకున్న 12 మంది ఐఏఎస్‌లు
యాదాద్రి : యాదగిరిగుట్ట పై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను గుట్టపైకి అనుమతించడం లేదు. -
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
-
వచ్చే ఏడాది దసరాకల్లా యాదాద్రి సిద్ధం
- అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి దేవాలయాన్ని భక్తుల సందర్శనకు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష జరిగింది. మంత్రులు కె.తారక రామారావు, లకా్ష్మరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ప్రధాన ఆలయ సముదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించే కాటేజీలకు సంబంధించి త్రీడీ వీడియో, ఫొటోలను సీఎం వీక్షించారు. ఆలయ కట్టడాల నమూనాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాజగోపురాలతోపాటు ప్రాకార మండపాలు పూర్తిస్థాయి శిలతో నిర్మించనున్నారని, పూర్తిస్థాయి కృష్ణశిలతో నిర్మితం కావడం ఆలయ విశేషమని ఆయన అన్నారు. 500 మంది నిష్ణాతులైన శిల్పులు పనుల్లో నిమగ్నమయ్యారని అధికారులు తెలపడంతో సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. కాటేజీల నిర్మాణానికి ఓకే యాదాద్రిలో భక్తుల బస కోసం 250 ఎకరాల్లో నిర్మించ తలబెట్టిన కాటేజీల నమూనాలకు చిన్నచిన్న మార్పులతో సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని తదితర వీవీఐపీల బస కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కాటేజీలు, దైవ సన్నిధి నిర్మాణాల తీరును అభినందించారు. ఆగమ శాస్త్ర సూత్రాలతో తంజావూరు వంటి వేల ఏళ్ల కిందటి సంప్రదాయ నిర్మాణ కౌశలానికి యాదాద్రి దేవాలయం ప్రాణప్రతిష్ట పోయనుందని అన్నారు. నిర్మాణాల అనంతరం గుట్టపైన వెల్లివిరిసే పచ్చదనంవల్ల ఆలయాల పరిసరాల ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వివరించారు. 108 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ఆమోదం యాదాద్రి దేవస్థానం క్షేత్ర పాలకుడిగా 108 అడుగుల భారీ ఆంజనేయస్వామి పాలరాతి విగ్రహ నమూనాకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. విగ్రహాన్ని తీర్చిదిద్దేందుకు చైనాకు చెందిన రూపశిల్పులు ముందుకు వచ్చారు. ఈ మేరకు భారీ ఆంజనేయ విగ్రహ నిర్మాణానికి ఆర్కిటెక్చర్ ఆనందసాయి ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ సభ్యులు త్వరలో చైనాను సందర్శించనున్నారు. పాలరాతితో తయారు చేసిన నమూనా ప్రతిమను వారికి అప్పగించి భారీ విగ్రహ రూపకల్పనకు నాంది పలుకనున్నారు.