యాదాద్రి : యాదగిరిగుట్ట పై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు
నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం స్వామివారి ధర్మ దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను గుట్టపైకి అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment