
సాక్షి,హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి గుడి అభివృద్ధి పనులపై సీఎం శుక్రవారం(ఆగస్టు30) సచివాలయంలో రివ్యూ చేశారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు. భక్తుల సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన వివరాలు అందించాలని ఆదేశించారు.
ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment