సాక్షి, యాదాద్రి: తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక, ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద స్నానం చేశారు. తడిబట్టలతో దేవాలయంలోకి వెళ్లి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు. అర్చకుల వద్ద బండి సంజయ్ ప్రమాణం చేస్తూ.. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫామ్‌హౌజ్ డీల్ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసినట్టు బండి సంజయ్ స్పష్టం చేశారు.
ఇక, బండి సంజయ్ యాదాద్రికి వచ్చిన క్రమంలో టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. మరోవైపు తెలంగాణలో రెండు రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment