
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఇటీవల చేసిన ఫొటోషూట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(అక్టోబర్ 25) కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడి లోపల తాను ఫోటోషూట్ చేయలేదని చెప్పారు. యాదాద్రి దేవాలయ అద్భుత నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందుకే తాను ఫొటో షూట్ చేశానన్నారు.
తాను లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడినని, ఆలయ ఈవో, పోలీసుల అనుమతి తీసుకునే ఫొటోషూట్ చేశానని కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తన భార్య,కూతురితో కలిసి యాదాద్రి గుడిలో రీల్స్ షూట్ చేశారు.
ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆలయ ఈవో కౌశిక్‌రెడ్డిపై యాదాద్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఈవో అనుమతితోనే వీడియోలు షూట్ చేశానని కౌశిక్‌రెడ్డి చెబుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. హైకోర్టులో కేఏ పాల్ వాదనలు
Comments
Please login to add a commentAdd a comment