ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్‌ జోన్‌ జోరుగా హుషారుగా | Sakshi
Sakshi News home page

ఎక్కడా తగ్గేదే లేదండీ..పల్లె టు పాపులర్‌ జోన్‌ జోరుగా హుషారుగా 

Published Thu, Apr 25 2024 5:04 PM

Social Media Influencers making content for social cause - Sakshi

 యూత్‌  పల్స్‌:  కంటెంట్‌లో సత్తా ఉండాలేగానీ కాలు కదపకుండా, కడుపులో చల్ల కదలకుండా సొంత ఊళ్లోనే ఉంటూ తగినంత డబ్బు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు గ్రామీణ యువ కంటెంట్‌ క్రియేటర్‌లు. హాస్యం నుంచి వ్యవసాయం వరకు రకరకాల సబ్జెక్ట్‌లను వైరల్‌ చేయడంలో నేర్పు సాధించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆరియారి గ్రామానికి చెందిన శివానీ కుమారికి సోషల్‌ మీడియాలో వేలాది మంది ఫాలోవర్‌లు ఉన్నారు. గ్రామీణ జీవితాన్ని పాటలు, కామెడీతో కూడిన స్కెచ్‌ల ద్వారా ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియాలో పేరు తెచ్చుకుంది. తనతో సమానంగా ఫాలోవర్‌లు ఉన్న ఇంగ్లీష్‌ క్రియేటర్‌లు కుమారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటికీ డబ్బుల గురించి చింత ఆమెకు లేదు. డబ్బుల కంటే కంటెంట్‌ క్రియేషన్‌ గురించే ఎక్కువ దృష్టి పెడుతుంది కుమారి.

ఒడిశాలోని చిత్రకూట్‌కు చెందిన ధీరజ్‌ టక్రీకి గతంలో ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడడం వచ్చేది కాదు. తడబడుతూ మాట్లాడేవాడు. దీంతో  యూట్యూబ్‌ వీడియోలు చూసి ధీరజ్‌  అమెరికన్స్‌లా ఫ్లూయెంట్‌గా మాట్లాడడం నేర్చుకున్నాడు. అమెరికన్‌ యాక్సెంట్‌తో మాట్లాడే నైపుణ్యం ధీరజ్‌ను ‘ఇన్‌స్టా ఫేమ్‌’ చేసింది. 2023లో ధీరజ్‌  ఫాలోవర్‌ల సంఖ్య 160 మాత్రమే. 

హ్యాండ్‌సమ్‌ అనే మాటను ఫారిన్‌ యాక్సెంట్‌లో ఎలా పలకాలి అనే రీల్‌ వైరల్‌ కావడంతో ధీరజ్‌ టక్రీ ఫాలోవర్‌ల సంఖ్య వేలకు చేరింది. మధ్యప్రదేశ్‌లోని బిరాఖేడీ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల రామ్‌  పారమార్‌ 17 సంవత్సరాల వయసులో యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. తన చానల్‌ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేవాడు. ఏడు, ఎనిమిది వేలతో యూట్యూబ్‌లో అతడి సంపాదన మొదలైంది. ఇప్పుడు బ్రాండ్‌ కొలాబరేషన్‌ ద్వారా లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.
పది లక్షలు వెచ్చించి తన గ్రామంలో ఆఫీస్‌ నిర్మించుకున్నాడు. కారు కొన్నాడు. ఇద్దరు సభ్యులతో ఉన్న టీమ్‌ను విస్తరించే పనిలో ఉన్నాడు. గుజరాతీ, తమిళ భాషల్లో కూడా కంటెంట్‌ను విస్తరించే ఆలోచనలో ఉన్నాడు.

‘మన దేశంలో చాలా ప్రాంతాల్లో రైతులు హిందీ భాషను అర్థం చేసుకోలేరు. వారిని దృష్టిలో పెట్టుకొని ఇతరుల సహకారంతో ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను క్రియేట్‌ చేయాలనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న  రైతులకు కంటెంట్‌ను చేరువ చేయాలనుకుంటున్నాను’ అంటున్నాడు ధీరజ్‌.

ఇరవై ఏడు సంవత్సరాల మయూరి  పాటిల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా డబ్బు సంపాదించాలనేది లక్ష్యం కాదు. ‘పశ్చిమ కనుమలను  కాపాడుకుందాం’ అనే నినాదంతో రీల్స్‌ చేస్తొంది. పశ్చిమ కనుమల అందాలను కళ్లకు కట్టేలా ఉండే ఆ రీల్స్‌ ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి. ఆలోచించేలా చేస్తున్నాయి.

 కొండపై ఉన్న ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలి జీవనశైలిపై పాటిల్‌ చేసిన రీల్‌ వైరల్‌ అయింది. ఎలాంటి కమర్శియల్‌ ఎలిమెంట్స్‌ లేని ఈ రీల్‌ సూపర్‌ సక్సెస్‌ కావడమే కాదు అది పాటిల్‌కు ఎంతో ఉత్సాహాన్నీ ఇచ్చింది.

మహారాష్ట్రలోని పులగామ్‌ గ్రామానికి చెందిన నేహా తాంబ్రేది సూపర్‌ పవర్‌ గ్రామీణ యాస. కామెడీ దట్టించి వివిధ సామాజిక సమస్యలపై తమ  ప్రాంత మాండలికంలో నేహా చేసే వీడియోలు సోషల్‌ మీడియాలో ΄ాపులర్‌ అయ్యాయి. తన గ్రామం నుంచి వెళ్లి పుణెలో ఇంజనీరింగ్‌ చేయడం నేహాకు కల్చరల్‌ షాక్‌.

‘నా గ్రామీణ మరాఠీ యాసను వెక్కిరించేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది నేహా.ఎంతోమంది వెక్కిరించిన ఆ యాస కంటెంట్‌ క్రియేషన్‌లో ఆమె బలం అయింది. నేహా సృష్టించిన  ‘తోంబ్రే బాయి’ క్యారెక్టర్‌ బాగా పాపులర్‌ అయింది.

స్థూలంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత క్రియేటర్‌లు సోషల్‌ మీడియాలో కొత్త దృశ్యం ఆవిష్కరిస్తున్నారు. కర్నాటకాలోని చిన్న పల్లెల నుంచి ఈశాన్యప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు కంటెంట్‌ క్రియేషన్‌ ద్వారా వైవిధ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రతి క్రియేటర్‌ తనదైన ప్రత్యేకతను కంటెంట్‌కు జోడిస్తున్నారు.

‘ఇన్‌స్టాగ్రామ్‌ ఉద్దేశాన్ని చాలా బ్రాండ్స్‌ మరిచి΄ోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌ అనేది ఫన్, స్టోరీ టెల్లింగ్‌కు వేదిక’ అంటుంది ముంబైకి చెందిన కంటెంట్‌ సొల్యూషన్స్‌ ఫర్మ్‌ ‘అప్పర్‌కేస్‌’ డైరెక్టర్‌ నిఠషా భర్వానీ. ఇన్‌స్టాగ్రామ్‌కు కీలకమైన ఫన్, వైవిధ్యాన్ని జోడిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు గ్రామీణ  ప్రాంత యువ కంటెంట్‌ క్రియేటర్‌లు.

ఎక్కడా తగ్గేదే లేదండీ
గ్రామీణ్ర ప్రాంత జీవనశైలికి అద్దం పట్టే వీడియోలతో ΄ాపులర్‌ అయింది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివానీ కుమారి. ఆడంబరాల కంటే సహజత్వమే కంటెంట్‌కు అందాన్ని తీసుకువస్తుంది అనేది కుమారి నమ్మే థియరీ. అందుకే ఆమె చేసే వీడియోల్లో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. యూట్యూబ్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో ఊళ్లో సొంత ఇళ్లు కట్టుకుంది. సోషల్‌ మీడియాలో కుమారి ΄ాపులారిటీని దృష్టిలో పెట్టుకొని వ్యక్తుల నుంచి మొదలు ఆర్గనైజేషన్స్‌ వరకు ప్రశంసపూర్వకమైన ఈ–మెయిల్స్‌ వస్తుంటాయి. అవి ఆమెకు బలమైన టానిక్‌లా పనిచేస్తాయి. ‘ఇంగ్లిష్‌లో గడగడా మాట్లాడితేనే కంటెంట్‌ హిట్‌ అవుతుంది’ అనే భావనను కుమారిలాంటి వాళ్లు తప్పని తేల్చేస్తు్తన్నారు. ఇంగ్లీష్‌–స్పీకింగ్‌ అర్బన్‌ క్రియటర్స్‌ కంటే తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు శివాని కుమారి


 

Advertisement
Advertisement