సిగరెట్‌ తాగుతూ పీఎస్‌ ఎదుట రీల్స్‌ చేసినందుకు.. | Young Man Arrested For Doing Reels While Smoking Infront Police Cigarette In Hyderabad - Sakshi
Sakshi News home page

సిగరెట్‌ తాగుతూ పీఎస్‌ ఎదుట రీల్స్‌ చేసినందుకు..

Published Sat, Dec 30 2023 11:58 AM | Last Updated on Sat, Dec 30 2023 1:07 PM

Young Man Videos In Police Station - Sakshi

హైదరాబాద్: పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సిగరెట్‌ తాగుతూ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించింది. రాంగోపాల్‌పేట్‌ ఇన్‌స్పెక్టర్‌ లింగేశ్వర్‌ కథనం ప్రకారం పాటిగడ్డ ఎన్‌బీటీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వంశీకృష్ణ (25) ఈ నెల 17న రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సిగరెట్‌ తాగుతూ రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీనిని గమనించిన రాంగోపాల్‌పేట్‌ పోలీసులు అతనిపై ఈ పెట్టీ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుచగా సికింద్రాబాద్‌ 16వ ప్రత్యేక మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ అతడికి 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement