
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హసన్ సెక్స్ వీడియోల వివాదంపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటికిరాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించి రేవణ్ణ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ పోస్టు చేశారు.
సెక్స్ స్కాండల్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్ ముందు వారం రోజుల్లో హాజరవుతానని తెలిపారు. నిజమే గెలుస్తుందన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియగానే మరుసటి రోజు ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే రేవణ్ణ సెక్స్ వీడియోలు హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి.
ప్రజ్వల్ లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయనే హసన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 నుంచి 2022 వరకు హసన్, బెంగళూరుల్లోని ప్రజ్వల్ రేవణ్ణ ఇళ్లలో పలువురు మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటికి రావడంతో సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment