లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్‌ రేవణ్ణపై ఛార్జ్ షీట్ | SIT files chargesheet against hd Revanna and Prajwal | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్‌ రేవణ్ణపై ఛార్జ్ షీట్

Published Sat, Aug 24 2024 12:57 PM | Last Updated on Sat, Aug 24 2024 1:18 PM

SIT files chargesheet against hd Revanna and Prajwal

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో  సంచలనం సృష్టించాయి. ఈ కేసులో సిట్‌ అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్‌ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రజ్వల్‌పై హోలెనరసిపూర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్‌ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు. ఆ వివరాలతో 2000పైగా పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

2019 నుంచి 2022 మధ్య హోలెనరసిపురలోని తన నివాసంలో పనిచేసిన పనిమనిషిని హెచ్‌డీ రేవణ్ణ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు రేవణ్ణ మహిళలను లైంగికంగా వేధించారని చార్జిషీట్‌లో పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్‌ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement