
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే.
ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు.