Former ISRO chief
-
కస్తూరిరంగన్‌కు తుది వీడ్కోలు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు. -
ఇస్రో మాజీ చైర్మన్ కన్నుమూత
బెంగళూరు : ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంజీకే మీనన్(88) మంగళవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఐదు దశాబ్దాలకు పైగా సైన్సులో విశిష్టమైన సేవలందించిన మీనన్, హోమీ జే బాబా లాగా పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు కీలక వ్యక్తిగా వ్యవహరించారు. 1972లో మీనన్ ఇస్రో చైర్మన్‌గా ఎంపికయ్యారు. అనంతరం వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో సైన్సు అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖకు సహాయమంత్రిగా పనిచేశారు. 35ఏళ్ల వయసులోనే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పద్మ విభూషణ్ వంటి పలు అవార్డులచే ఆయనను కేంద్రప్రభుత్వం సత్కరించింది. 1982-1989మధ్య ప్లానిక్ కమిషన్ సభ్యుడిగా, 1986-89 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, 1989-1990 మధ్య సీఎస్ఐఆర్ వైస్‌ప్రెసిడెంట్‌గా అనంతరం 1990-96 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పలు కీలక బాధ్యతలు చేపట్టారు. కాస్మిక్ రే అధ్యయనంలో ఆయన ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు.