వాటర్ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్ | Georgia news anchor falls to death from NC waterfall Lake Toxaway | Sakshi
Sakshi News home page

వాటర్ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్

Published Mon, Jul 25 2016 8:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

వాటర్ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్

వాటర్ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్

జార్జియా: అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా యాంకర్ నార్త్ కాలిఫోర్నియా వాటర్ ఫాల్స్ లో ప్రమాదవశాత్తూ  కొట్టుకుపోవడం విషాదాన్ని నింపింది.   జార్జియాలో యాంకర్ గా పనిచేస్తున్న టేలర్ టెర్రాల్ (24)  టెక్సావే లేక్  రైన్ బో  జలపాతంలో పడి మృత్యువాత పడ్డారు.   స్థానిక అమెరికా అటవీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ట్రాన్సిల్వేనియా కౌంటీ,  రైన్ బో  వాటర్ పాల్స్  దగ్గర టేలర్ రాళ్ల పై  నడుస్తుండగా కాలు జారి 160 అడుగుల లోతుకి  పడిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.  

కాగా  2013లో రిపోర్టర్ గా కరీర్ ప్రారంభించిన టేలర్ తరువాత యాంకర్ గా పదోన్నతి పొందారని ఆమె స్నేహితులుతెలిపారు.  శుక్రవారం ఆమె పుట్టిన రోజని గుర్తు  చేసుకున్నారు. ఆమె మృతిని ధృవీకరించిన   సదరు ఛానల్ న్యూస్ డైరక్టర్ బ్రాండన్ కూడా ఆమె అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎపుడూ ప్రకాశవంతమైన చిరునవ్వు తో  వుండే టేలర్ మంచి  హార్డ్ వర్కర్ అని తెలిపారు.  అటు టేలర్ మృతిపై  స్థానిక మీడియా వర్గాలు దిగ్ర్భాంతిని  వ్యక్తం చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement