falls to death
-
భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్ వీడియో
TW ⚠️Instead of hitting the brake, she pushed the accelerator at the edge of the hill…Despite not knowing how to drive, she reversed a Toyota Etios as her friend Shivraj Mule recorded. Shweta Survase, 23, from Ch. Sambhaji Nagar, died while making a reel near Dutt Dham… pic.twitter.com/eadsWau9AT— Sneha Mordani (@snehamordani) June 18, 2024అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం. కొత్త కారు.. డ్రైవింగ్ సరిగ్గా రాదు. పైగా ఎత్తైన కొండ మీద రివర్స్ తీసుకుంటోంది. ఈ క్రమంలో బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సిలరేటర్ రైజ్ చేసింది. అంతే కళ్లు మూసి తెరిచే లోపే 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేతా దీపక్ సుర్వాసే (23)గా గుర్తించారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ ధామ్ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది.స్నేహితుడు సూరజ్ సంజౌ ములేతో కలిసి శ్వేతా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్‌లోని సులిభంజన్ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్ కారు డ్రైవ్ చేయాలని ఉత్సాహ పడింది. ఎత్తైన కొండమీద కారును రివర్స్ చేస్తోంది. దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు. మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున యాక్సిలరేటర్ మీది కాలు వేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, "క్లచ్, క్లచ్, క్లచ్" అంటూ అరిచాడు. ఆమెను ఆపడానికి పరిగెత్తాడు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
భవనంపై నుంచి పడి ఎయిర్‌హోస్ట్ మృతి.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్
బెంగళూరు: ఎయర్హోస్ట్ భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని కోరుమంగళలో రేణుకా రెసిడెన్సీలోని అపార్ట్మెంట్లో ఎయిర్ హోస్ట్ అర్చన ధీమాన్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆదేశ్‌తో కలిసి నివసిస్తోంది. ఆదేశ్ నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరికి డేటింగ్ సైట్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. గత ఆరు నెలలుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు. కాగా ఎయిర్‌హోస్ట్ అర్చన మృతిలో ఆదేశ్ పాత్ర ఉందనే అనుమానంతో పోలీసులు అతడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయని ఆదేశ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలిపాడు. ఆరోజు అర్చన నాల్గో అంతస్థు బాల్కనీ నుంచి జారిపడిందని, తాను ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని పేర్కొన్నాడు. అయితే దర్యాప్తులో ఈ ప్రమాదానికి నాలుగు రోజుల ముందే అర్చన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పోలీసులు. (చదవండి: స్వలింగ వివాహలకు చట్టబద్ధత అంశం.. రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు) -
స్నేహితుల కళ్లదుటే ఘోరం.. 6వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి
మరణం ఊహించనిది. చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కళ్ల ముందే సంతోషంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ మృత్యు ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రెండు క్షణాల ముందు వరకు స్నేహితులతో ఆనందంగా ముచ్చటించిన ఓ యువకుడు ప్రాణాలు అంతలోనే గాల్లో కలిసిపోయాయి. హాస్టల్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి కింద పడి అనూహ్యంగా మరణించాడు. వివరాలు.. జల్పైగురి జిల్లాలోని ధుప్గురికి చెందిన ఇషాంషు బట్టాచార్య అనే 20 ఏళ్ల యువకుడు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగష్టులో కోటాలోని జవహార్ నగర్లో కోచింగ్ తీసుకుంటూ ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రోజు స్నేహితులతో బయటకు వెళ్లి అర్థరాత్రి తన హాస్టల్ తిరుగొచ్చాడు. రూమ్ ముందు ఉన్న బాల్కనీలో స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. గదిలోకి వెళ్లే ముందు బాల్కనీలో చెప్పులు పక్కకు పెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోవడంతో రెయిలింగ్‌పై పడ్డాడు ఇషాంషు బరువు తట్టుకోలేక అల్యూమినియం రెయిలింగ్ విగిరిపోవడంతో అక్కడి నుంచి కింద అమాంతం పడిపోయాడు. బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు కోటా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించామని.. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కన్నీరు పెట్టించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. Breaking News: Coaching student dies after falling from sixth floor of hostel in Rajasthan's Kota. The net was broken, he fallen out when he was trying to put on his slippers by standing with the support of net. Heart-wrenching !#Rajasthan #Kota pic.twitter.com/nZixPXwNfj — Ashwini Shrivastava (@AshwiniSahaya) February 3, 2023 -
విషాదం: 25వ అంతస్తు నుంచి పడి కవలలు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 25వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కవల సోదరులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తొమ్మిదవ తరగతి చదువుతున్న సత్యనారాయణ, సూర్యనారాయణ ఇద్దరు కవలలు. వీరికి మరో సోదరి కూడా ఉంది. చెన్నైకి చెందిన వీరు రెండు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఘజియాబాద్ వచ్చారు. అక్కడ సిద్ధార్థ్ విహార్ కాంప్లెక్స్‌లో 25వ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం ముగించుకుని.. తల్లి మొబైల్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ విన్నారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి కూర్చుని మొబైల్లో గేమ్స్ ఆడసాగారు. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్..?) తల్లి వచ్చి పడుకోమని చెప్పడంతో ఇంట్లోకి వెళ్లారు కవల సోదరులు. తల్లి నిద్రపోయిన తర్వాత తిరిగి బాల్కనీలోకి వచ్చారు ఇద్దరు సోదరులు. అర్థరాత్రి 1 గంట సమయంలో ఇద్దరు సోదరులు 25వ అంతస్తు నుంచి పడి.. మృతి చెందారు. కాసేపటి తర్వాత తల్లి లేచి పిల్లల కోసం వెతికింది. బాల్కనీ తలుపు తీసి ఉండటంతో అక్కడకు వెళ్లి చూసింది.. కానీ కనిపించలేదు. కింద జనాలు గుంపులుగా చేరడం చూసి అక్కడకు వెళ్లింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఒక్కనిమిషం ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. (చదవండి: వీథి బాలల్ని బడిపిల్లలుగా మార్చింది...మమ్మీజీ) కింద రక్తపు మడుగులో తన ఇద్దరు కుమారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. బిడ్డల మృతదేహాలను పట్టుకుని గుండెలవిసేలా ఏడ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సత్య, సూర్యల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాల్కనీలో మాకు ప్లాస్టిక్ చైర్, దాని మీద ఓ కూర్చి కనిపించింది. చంద్రుడిని చూడాలని భావించి.. ఇలా ఏర్పాటు చేసుకుని ఉంటారు. కానీ దురదృస్టవశాత్తు పైనుంచి కిందపడి మరణించి ఉంటారని భావిస్తున్నాం. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి’’ అని తెలిపాడు. చదవండి: 70 ఏళ్ల తర్వాత కలుసుకుని.. అరుదైన రికార్డు సృష్టించిన కవలలు -
టిక్‌టాక్ స్టార్ దుర్మరణం, షాక్‌లో ఫ్యాన్స్: వైరల్ వీడియో
బీజింగ్: లైవ్ స్ట్రీమ్ వీడియో షూట్ చేస్తూ చైనీస్ టిక్‌టాక్ స్టార్ జియావో క్యుమీ (23) దుర్మరణం పాలైన ఘటన షాక్‌కు గురిచేసింది. టిక్‌టాక్ వీడియో రికార్డ్ చేస్తూ 160 అడుగుల నుంచి కింద పడిపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రొఫెషనల్ క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసే జియావో ఆ క్రేన్ నుండే పలు వీడియోలు తీస్తూ ఉండేది. ఇలా అనేక వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ స్టార్‌గా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే సహోద్యోగులంతా ఇంటికి వెళ్లి పోయిన తరువాత క్రేన్ క్యాబిన్లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. కానీ ఇంతలోనే అదుపు తప్పి కింద పడిపోయింది. ఫోన్ చేతిలో పట్టుకుని కింద పడిపోతున్న దృశ్యాలు వీడియోలో అస్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. టిక్‌టాక్ చైనీస్ వెర్షన్ డౌయిన్ ప్లాట్‌ఫాంలో లక్షమంది మందికి పైగా ఫాలోవర్లో జియావో క్యుమీ చైనాలో అత్యంత ప్రజాదరణ పొందారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఈమె డ్యాన్స్ వీడియోలు కూడా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో జియావో ఆకస్మిక మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచింది. కాగా ఇటీవల హాంగ్‌కాంగ్‌కు చెందిన డేర్‌డెవిల్ ఇన్ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ జలపాతం సమీపంలో ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. -
పాపం పసివాడు.. తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి!
సాక్షి, ఖైరతాబాద్: అప్పటివరకు గోరుముద్దలు తినిపించిన తల్లి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి రెండున్నరేళ్ల బాలుడు ఇంటిముందు ఉన్న సంపులో పడి మృతిచెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్, బీజేఆర్‌నగర్‌కు చెందిన ఉపేందర్, నాగేశ్వరి దంపతులకు అభినయ్(2.5 ) కుమారుడు ఉన్నాడు. ఉపేందర్ గత కొంత కాలంగా కర్నాటకలో ఉంటుండగా నాగేశ్వరి కుమారుడితో కలిసి రేకుల ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి బాబుకు అన్నం తినిపించి ఇంట్లోకి వెళ్లింది. అరగంట తర్వాత బయటికి వచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా నీటి సంపులో క నిపించాగు. చిన్నారికి బయటికి తీసి వెంటనే వాస వి హాస్పిటల్‌కు, అక్కడి నుంచి నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీటి సంపుపై కప్పు లేనందునే ప్రమాదవశాత్తు బాలు డు అందులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు సంపులపై మూతలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చదవండి: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ! -
5.5 లక్షలతో బ్యాంక్‌పై నుంచి కిందపడి..
కన్నూరు: పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారం ఓ ఉద్యోగి ప్రాణం తీసింది. కేరళ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉన్ని (48) అనే ఉద్యోగి 5.5 లక్షల రూపాయలను (500, 1000 నోట్లు) బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించాడు. కన్నూరులో శుక్రవారం ఈ విషాదకర సంఘటన జరిగింది. ఉన్ని తన వద్ద ఉన్న నగదును గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచిలో డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధ్యంకాలేదు. శుక్రవారం మరోసారి ఆయన బ్యాంక్‌కు వెళ్లాడు. బ్యాంక్ ఉన్న భవనం మూడో అంతస్తులో నగదును డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఈ రోజు కూడా ప్రజలు భారీ సంఖ్యలో బ్యాంక్‌కు వచ్చారు. రద్దీ మధ్యే మూడో అంతస్తుపైకి వెళ్లిన ఉన్ని అక్కడి నుంచి కిందకు పడటంతో మరణించాడు. ఉన్ని దగ్గర ఉన్న బ్యాగ్‌లో 5.5 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తూ కిందపడ్డాడా లేక పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. -
వాటర్‌ఫాల్ లో కొట్టుకుపోయిన యాంకర్
జార్జియా: అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా యాంకర్ నార్త్ కాలిఫోర్నియా వాటర్ ఫాల్స్ లో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోవడం విషాదాన్ని నింపింది. జార్జియాలో యాంకర్ గా పనిచేస్తున్న టేలర్ టెర్రాల్ (24) టెక్సావే లేక్ రైన్ బో జలపాతంలో పడి మృత్యువాత పడ్డారు. స్థానిక అమెరికా అటవీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ట్రాన్సిల్వేనియా కౌంటీ, రైన్ బో వాటర్ పాల్స్ దగ్గర టేలర్ రాళ్ల పై నడుస్తుండగా కాలు జారి 160 అడుగుల లోతుకి పడిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా 2013లో రిపోర్టర్ గా కరీర్ ప్రారంభించిన టేలర్ తరువాత యాంకర్ గా పదోన్నతి పొందారని ఆమె స్నేహితులుతెలిపారు. శుక్రవారం ఆమె పుట్టిన రోజని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతిని ధృవీకరించిన సదరు ఛానల్ న్యూస్ డైరక్టర్ బ్రాండన్ కూడా ఆమె అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎపుడూ ప్రకాశవంతమైన చిరునవ్వు తో వుండే టేలర్ మంచి హార్డ్ వర్కర్ అని తెలిపారు. అటు టేలర్ మృతిపై స్థానిక మీడియా వర్గాలు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశాయి.