మరణం ఊహించనిది. చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కళ్ల ముందే సంతోషంగా కనిపించిన వారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ మృత్యు ఘటన ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రెండు క్షణాల ముందు వరకు స్నేహితులతో ఆనందంగా ముచ్చటించిన ఓ యువకుడు ప్రాణాలు అంతలోనే గాల్లో కలిసిపోయాయి. హాస్టల్ బిల్డింగ్‌లోని ఆరో అంతస్తు నుంచి కింద పడి అనూహ్యంగా మరణించాడు.
వివరాలు.. జల్‌పైగురి జిల్లాలోని ధుప్‌గురికి చెందిన ఇషాంషు బట్టాచార్య అనే 20 ఏళ్ల యువకుడు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగష్టులో కోటాలోని జవహార్ నగర్‌లో కోచింగ్ తీసుకుంటూ ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రోజు స్నేహితులతో బయటకు వెళ్లి అర్థరాత్రి తన హాస్టల్ తిరుగొచ్చాడు. రూమ్ ముందు ఉన్న బాల్కనీలో స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. గదిలోకి వెళ్లే ముందు బాల్కనీలో చెప్పులు పక్కకు పెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోవడంతో రెయిలింగ్‌పై పడ్డాడు
ఇషాంషు బరువు తట్టుకోలేక అల్యూమినియం రెయిలింగ్ విగిరిపోవడంతో అక్కడి నుంచి కింద అమాంతం పడిపోయాడు. బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మరణించినట్లు కోటా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఎంబీఎస్ ఆసుపత్రికి తరలించామని.. పోస్టుమార్టం అనంతరం కుటుంబానికి అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కన్నీరు పెట్టించే ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
Breaking News: Coaching student dies after falling from sixth floor of hostel in Rajasthan's Kota.
— Ashwini Shrivastava (@AshwiniSahaya) February 3, 2023
The net was broken, he fallen out when he was trying to put on his slippers by standing with the support of net.
Heart-wrenching !#Rajasthan #Kota pic.twitter.com/nZixPXwNfj
Comments
Please login to add a commentAdd a comment