బీబీసీ టాప్‌ యాంకర్ల జీతాల్లో కోత | Six Male BBC Presenters Take Pay Cuts After Gender Gap Reveal | Sakshi
Sakshi News home page

బీబీసీ టాప్‌ యాంకర్ల జీతాల్లో కోత

Published Sat, Jan 27 2018 1:45 PM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM

 Six Male BBC Presenters Take Pay Cuts After Gender Gap Reveal - Sakshi

సంస్థలో పురుష , మహిళా ఉద్యోగుల మధ్య ఆదాయ అసమానతలు ఆరోపణల నేపథ్యంలో బీబీసీకి చెందిన టాప్‌ న్యూస్‌ ప్రెజెంటర్లు దిగి రాక తప్పలేదు. తమ వేతనాలను తగ్గించుకునేందుకు ఆరుగురు యాంకర్లు ఆమోదం తెలిపారు.   జెరెమీ వైన్, జాన్ హంప్రీస్, నిక్కీ క్యాంబెల్,  హ్యూ ఎడ్వర్డ్స్, జాన్ సోపెల్‌,  జెరెమీ వైన్‌, నిక్‌ రాబిన్‌ సన్‌  తమ వేతనాల్లో కోతకు అంగీకరించారు. ఒకే పని చేస్తున్న స్త్రీ పురుషులకు సమాన వేతనాలను అమలు చేయాలి  పే కట్‌కు అంగీకరించిన  జెరెమీ వైన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మహిళా సహోద్యోగులకే తన మద్దతు అని  ప్రకటించారు.

పురుష, మహిళా అంతర్జాతీయ ఎడిటర్ల వేతనాలలో అసమానతలకు నిరసనగా బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీబీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.   ప్రేక్షకులతో నిజమైన సంబంధం కలిగి ఉన్న గొప్ప జర్నలిసులు, ప్రెజెంటర్లనీ తెలిపింది.  వారు తమ సంస్థలో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొంది.

జులై, 2017లో బీబీసీ తమ సంస్థలో  తమ సంస్థలో అత్యధిక  వేతనాలు తీసుకుంటున్న వారిలో 2/3వంతు పురుషులే ఉన్నారని, ఇందులో ఏడుగురు ఎడిటర్లు ఉన్నారని  నివేదించింది.  150,000 పౌండ్ల(సుమారు రూ.1.35 కోట్లు)కు పైగా వేతనాలు పొందుతున్న వారి జాబితాను విడుదల  చేసింది. ఆ జాబితాలో క్రిస్ ఎవాన్స్ 2016/2017లో రూ.19.84 కోట్ల నుంచి రూ.22.54 కోట్ల వేతనంతో మొదటి స్థానంలో నిలిచారు. అదే సమయంలో మహిళల్లో అత్యధికంగా క్లాడియా వింకెల్‌మ్యాన్ రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు మాత్రమే వేతనంగా పొందినట్టు రిపోర్ట్‌  చేసింది.   దీంతో బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో వివక్ష,  వేతన వ్యత్యాసాలు అంశంపై  వివాదం రాజుకుంది.  కాట్టి కే, ఎమిలీ మెట్లిస్‌, అలెక్స్ జోన్స్  సహా దాదాపు 40మంది హై ప్రొఫైల్‌ మహిళా ఉద్యోగులు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలంటూ ఒక  బహిరంగ లేఖ రాయడం కలకలం రేపింది.

స్త్రీ, పురుష వేతన వ్యత్యాసానికి నిరసనగా  గత నెలలో  బీబీసీ చైనా ఎడిటర్‌ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు. దీనిపై బ్రిటీష్‌  కల్చరల్‌ సెక్రటరీ మాట్‌ హాన్‌ కాక్‌ కూడా దీనిపై స్పందించారు. బీబీసీ లాంటి అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగులకు  న్యాయమైన, సమాన వేతనాలు ఉండాలని, బ్రిటిష్ విలువలకు ధృవతారలా బీబీసీ ఉండాలని సూచించారు. కాగా ఆన్-ఎయిర్ ప్రెజెంటర్లు, ఎడిటర్లు, కరస్పాండెంట్ల వేతనాల విషయంలో బీబీసీ అనుసరించే విధానాన్ని వచ్చే వారం విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement