ఇస్లామాబాద్: ఎనిమిదేళ్ల బాలికను కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై పాకిస్థాన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు నిరసనగా ప్రముఖ చానెల్ సమా టీవీలో ఓ యాంకర్ తన చిన్నారి కూతురితో కలిసి న్యూస్ చదవడం పలువురిని కదిలించింది.
కిరన్ నాజ్ అనే యాంకర్ తన కూతురిని ఒడిలో కూచుబెట్టుకొని న్యూస్ బులిటెన్‌ను ప్రారంభించింది. 'ఈ రోజు నేను కిరన్ నాజ్‌ను కాదు. ఒక అమ్మను.. అందుకే నా కూతురితోపాటు ఇక్కడ కూర్చున్నాను' అని ఆమె న్యూస్ ప్రారంభించారు. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమె భావోద్వేగంగా 1.50 నిమిషాలపాటు మాట్లాడారు. 'చిన్న శవపేటికలే అత్యంత బరువైనవనే మాట ఎంతో సత్యం. ఆ చిన్నారి శవపేటిక బరువును ఇప్పుడు యావత్ పాకిస్థాన్ మోస్తోంది' అని నాజ్ పేర్కొన్నారు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని కసుర్‌లో ఎనిమిదేళ బాలికపై కిరాతకంగా అత్యాచారం, హత్య జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రావిన్స్ అంతటా ఈ ఘటనకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. భారత సరిహద్దుకు అతికొద్దీ దూరంలోనే కసూర్ పట్టణం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment