దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం! | government-flayed-for-rss-speech-on-doordarshan | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 3 2014 4:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:12 AM

దూరదర్శన్ ఛానల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం శుక్రవారం నాడు లేవనెత్తింది. ప్రభుత్వ ప్రసారకర్త అయిన ఛానల్ను ఈ రకంగా దుర్వినియోగం చేయడం సరికాదని సీపీఎం విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్ను వాడుకున్నారని పార్టీ ఓ ప్రకటనలో విమర్శించింది. జాతీయ ప్రజా ప్రసారకర్తకు ఆర్ఎస్ఎస్ లాంటి ఓ మతవాద సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రచారం చేయడం తప్ప మరో పని ఏమీ లేదా అని ప్రశ్నించింది. మోదీ సర్కారు ప్రజా ప్రసారకర్త ఛానల్ను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది.

Advertisement
 
Advertisement
 
Advertisement