న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది.
కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్‌టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు.
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
Published Fri, Sep 27 2013 10:20 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement