షాకింగ్‌: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు | Former Doordarshan anchor crushed by falling tree in Mumbai, family blames BMC | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు

Published Sat, Jul 22 2017 12:33 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

షాకింగ్‌: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు - Sakshi

షాకింగ్‌: యాంకర్‌ను మింగేసిన కొబ్బరిచెట్టు

ముంబై: ముంబైలో  అనూహ్యమైన ప్రమాదం కలకలం రేపింది.   మహిళను   ఓ కొబ్బరిచెట్టు  మృత్యువులా వెంటాడింది.  మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన  ఆమె నెత్తిపై కొబ్బరి చెట్టు  ఒక్కసారిగా విరిగి పడిన షాకింగ్‌ ఇన్సిడెంట్‌  చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో  దూరదర‍్శన్‌ మాజీ యాంకర్‌  మరణించిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది.   స్థానిక సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. బాధిత మహిళను దూరదర్శన్‌  మాజీ యాంకర్‌  కంచన్‌ రజత్‌ నాథ్‌(58)గా  గుర్తించారు. ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలోని   శుక్రవారం ఉదయం  ఈ ప్రమాదం చోటు చేసుకుంది

దూరదర్శన్‌ మాజీ యాంకర్‌, యోగ టీచర్‌ కూడా అయిన  కంచన్‌ నాథ్‌  గురువారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ వెళ్లారు. ఇంటికి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమెమీద విరుచుకుపడింది. దీంతో ఆమె చెట్టుకింద పడి నలిగిపోయింది.  అకస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.  అయినా  ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో శనివారం  ఉదయం కన్ను  మూశారని  కంచన్‌ భర్త తెలిపారు. 

ఈ విషాదంపై ఆమె కుటుంబ సభ్యులు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.  పాడైపోయి.. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న  చెట్టు కొట్టివేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో  బీఎంసీ  అనుమతి నిరాకరించిందని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement