దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం! | Government flayed for RSS speech on Doordarshan | Sakshi

దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!

Oct 3 2014 2:03 PM | Updated on Sep 2 2017 2:20 PM

దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!

దూరదర్శన్లో ఆర్ఎస్ఎస్ ప్రసంగం!

దూరదర్శన్ ఛానల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దూరదర్శన్ ఛానల్లో ఆర్ఎస్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం శుక్రవారం నాడు లేవనెత్తింది. ప్రభుత్వ ప్రసారకర్త అయిన ఛానల్ను ఈ రకంగా దుర్వినియోగం చేయడం సరికాదని సీపీఎం విమర్శించింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ తన హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి దూరదర్శన్ ఛానల్ను వాడుకున్నారని పార్టీ ఓ ప్రకటనలో విమర్శించింది.

జాతీయ ప్రజా ప్రసారకర్తకు ఆర్ఎస్ఎస్ లాంటి ఓ మతవాద సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రచారం చేయడం తప్ప మరో పని ఏమీ లేదా అని ప్రశ్నించింది. మోదీ సర్కారు ప్రజా ప్రసారకర్త ఛానల్ను దుర్వినియోగం చేస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement