మరోసారి ‘రామాయణ్‌’ | Ramayan to be retelecast on Doordarshan amid lockdown | Sakshi
Sakshi News home page

మరోసారి ‘రామాయణ్‌’

Published Sat, Mar 28 2020 5:39 AM | Last Updated on Sat, Mar 28 2020 5:39 AM

Ramayan to be retelecast on Doordarshan amid lockdown - Sakshi

న్యూఢిల్లీ: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని జీవితగాథ ఆధారంగా తీసిన రామాయణ్‌ ధారావాహిక మరోసారి దేశవ్యాప్తంగా ప్రజలను అలరించనుంది. ఈ సీరియల్‌ను ఈనెల 28వ తేదీ నుంచి దూరదర్శన్‌ డీడీ నేషనల్‌ చానెల్‌లో ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడించారు. దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించామన్నారు. శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణ్‌ ప్రసారమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement