
సోషల్ మీడియా పుణ్యానా రాత్రికి రాత్రే స్టార్లు అయ్యే అవకాశం కల్గింది జనాలకు. ప్రియా ప్రకాశ్ వారియర్, సింగర్ బేబీ లాంటి వారందరికి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చింది సోషల్ మీడియానే. ఇలాంటిదే టిక్‌టాక్ యాప్. దీని ద్వారా జనాలు తమలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయగల్గుతున్నారు. అయితే దీని వల్ల లాభల కంటే కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయనే వాదన ఉంది. ఈ మధ్యే కొన్ని రాష్ట్రాల్లో ఈ యాప్‌పై నిషేధం విధించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సంగతలా వదిలేస్తే ప్రస్తుతం టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.
దూరదర్శన్‌లో వార్తలు చూసే వారికి ఆ టైంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే కాదేదీ కవితకనర్హం అన్నట్లు ఈ మ్యూజిక్‌కు వెరైటీగా బ్రేక్ డ్యాన్స్ చేశాడో యువకుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. వైశాఖ్ నాయర్ అనే యువకుడు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి దూరదర్శన్ వార్తలు వచ్చేటప్పుడు వినిపించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌కు బ్రేక్ డ్యాన్స్ వేశాడు. దాన్ని కాస్తా టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో అది ఇప్పడు తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షమందికి పైగా చూశారు. ‘ప్రతి ట్రాక్‌కు వైశాఖ్ భలే చేశాడే’ అని కొందరు మెచ్చుకుంటే, ‘వీడికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు’ అంటూ ఇంకొందరు.. ‘జనరేటర్ మోతకు కూడా వీడు డ్యాన్స్ చేయగలడు’ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు జనాలు.
Doordarshan would not hv imagined this in their wildest dreams !! 😂 pic.twitter.com/epJ86aVssE
— (•ิ_•ิ) Silk (@Ya5Ne) March 4, 2019