Overweight Man Loses 70 Kgs After His Girlfriend Broke Up With Him - Sakshi
Sakshi News home page

వైరల్‌: ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి

Published Tue, Aug 23 2022 4:21 PM | Last Updated on Wed, Aug 24 2022 8:29 AM

Viral: Man Was Dumped By Girlfriend For Being Too Fat Loses 70kg - Sakshi

బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తిని అతని గర్ల్‌ఫ్రెండ్‌ వదిలేసి వెళ్లింది. ప్రియురాలు బ్రేకప్‌ చేప్పడంతో చాలా కుంగిపోయాడు. అయితే ఆమెకు తన మాటలతో కాకుండా చర్యలతో తగిన సమాధానం చెప్పాడు. ఉబకాయం నుంచి కండల వీరుడిగా తయారయ్యాడు. ఏకంగా 70 కిలోలు బరువు తగ్గి వావ్‌ అనిపించాడు. స్ఠూలకాయం నుంచి ఫిట్‌గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. తన వెయిట్‌ లాస్‌ జర్నీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఆన్‌లైన్‌ స్టార్‌గా మారాడు.

అధిక బ‌రువుతో బాధపడుతున్న పువి అనే యువకుడిని అదే కార‌ణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. దీంతో తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చాలెంజ్‌గా స్వీకరించాడు. అనుకున్నట్లుగానే జిమ్‌కు వెళ్లి వర్కౌట్‌ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అతని శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు. ప్రియురాలు బ్రేకప్‌ చెప్పిన 139 కిలోల బరువు ఉన్న పువి.. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే 70 కిలోల కొవ్వును క‌రిగించి 74 కిలోలకు చేరాడు.
చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే..

గతంలో ట్రిపుల్‌ ఎక్స్‌ఎల్‌ సైజ్‌ నుంచి నుంచి ఇప్పుడు స్మాల్‌ సైజ్‌కు మారిపోయాడు. టిక్‌టాక్ యూజ‌ర్ పువి త‌న వ‌ర్క‌వుట్ వీడియోల‌ను త‌ర‌చూ షేర్ చేస్తుండే వాడు. దీంతో అతడి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కండ‌లు తీరిన దేహంతో పువి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్.. పలువురిలో స్పూర్తి నింపుతోంది. అతడి  కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement