
దూరదర్శన్ కు జదేకర్ చురక
పనాజీ: అన్ని విషయాల్లో ఆలస్యంగా స్పందించే దూరదర్శన్ కు కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేవకర్ బహిరంగంగా మొట్టికాయ వేశారు. దక్షిణ గోవా రిసార్ట్ లో జరిగిన 16వ ఆల్ ఇండియా విప్స్ కాన్ఫెరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన
విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మంత్రి ప్రసంగించేందుకు సిద్ధంకాగానే ఆలస్యంగా వచ్చిన దూరదర్శన్ ప్రతినిధి హడావుడిగా ఆయన ముందు మైక్ పెట్టాడు. దీన్ని గమనించిన మంత్రి... దూరదర్శన్ అన్ని విషయాల్లో ఆలస్యంగానే స్పందిస్తుంది అంటూ చురక అంటించారు. జాతీయ అధికార చానల్ అయిన దూరదర్శన్ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే.