సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా కలవరపెడుతున్న నేపథ్యంలో దూరదర్శన్ పలు ఆసక్తికర ప్రసారాలను పునఃప్రసారం చేయనుంది. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు రామాయణం, మహభారతం సీరియళ్లను మళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని పాత షోలను సైతం పునః ప్రసారం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది.
1989లో షారుక్‌ఖాన్ నటించిన టీవీ సిరీస్ ‘సర్కస్’తో పాటు 1993లో వచ్చిన రజిత్ కపూర్ బయో డిటెక్టివ్ షో ‘బ్యోమకేశ్ బక్షి’లను శనివారం నుంచి ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది. సర్కస్‌ను రాత్రి 8 గంటలకు, బ్యోమకేశ్ బక్షి ఉదయం 11 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. (‘ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు’ )
Shekharan is BACK on @DDNational!
— Doordarshan National (@DDNational) March 27, 2020
Friends, #StayAtHome and watch your favorite @iamsrk's #Circus - TV Series (1989) - From 28th March at 8 pm on @DDNational pic.twitter.com/MZ2zWvmyf5
కాగా సర్కస్‌లో షారుక్ శేఖరన్ పాత్ర చేశాడు. ఈ పాత్ర అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పటికీ చాలామంది ఆ పాత్రను గుర్తు చేసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. ‘సర్కస్’కు విక్కీ అజీజ్ మీర్జా, కుందన్ షా దర్శకత్వం వహించారు. రేణుకా షాహనే, పవన్ మల్హోత్రా అశుతోష్ గోవారికర్ ముఖ్యపాత్రల్లో నటించారు. 1989, 1990లో మొదట ప్రసారం చేసిన సర్కస్ మళ్లీ ప్రజల డిమాండ్ మేరకు 2017, 2018లో కూడా ప్రసారం చేశారు. అయితే తాజాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలను అలరించడానికి మళ్లీ రెడీ అవుతుంది. అలాగే రజిత్ కపూర్ షో బ్యోమకేశ్ బక్షి మొదట 1993 నుంచి 1997 దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది. (బ్రెజిల్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment