సాక్షి, హైదరాబాద్: దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్‌కు ‘యాదగిరి’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో దూరదర్శన్ ‘సప్తగిరి’ పేరుతో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రసారాలు జరిగేవి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రసారాలు చేసేందుకు కొత్త ప్రాంతీయ చానల్‌ను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ప్రసార భారతి’ సంస్థ ప్రారంభించనుంది. ఈ చానల్‌కు ‘యాదగిరి’ అనే పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ దూరదర్శన్ అధికారులను కోరారు. ప్రసారాలను ఈనెల 27 నుంచి ప్రారంభిస్తామని హైదరాబాద్ దూరదర్శన్ అధికారులు తెలిపారు.